Begin typing your search above and press return to search.

టీ హైకోర్టు సంచ‌ల‌నం!... జంపింగ్‌ ల‌పై చ‌ర్య‌లేన‌ట!

By:  Tupaki Desk   |   30 April 2019 1:23 PM GMT
టీ హైకోర్టు సంచ‌ల‌నం!... జంపింగ్‌ ల‌పై చ‌ర్య‌లేన‌ట!
X
పార్టీ ఫిరాయింపుల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఓ పార్టీ టికెట్ పై ప్ర‌జా ప్ర‌తినిధిగా ఎంపికై... ఆ త‌ర్వాత ఏదో కార‌ణంతో స‌ద‌రు స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌కుండానే పార్టీలు మారిన నేత‌ల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న కోణంలో హైకోర్టు చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌లే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచిన మొత్తం 19 మందిలో 11 మంది అదికార టీఆర్ఎస్ లో చేరిపోయారు.

మ‌రో ఇద్ద‌రు ముగ్గురు కూడా టీఆర్ ఎస్ చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌న్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో టీ సీఎల్పీని టీఆర్ ఎస్ ఎల్పీలో విలీనం చేసే దిశ‌గా సాగుతున్న చ‌ర్య‌ల‌పై టీ కాంగ్రెస్ అంట మేల‌క్కొంద‌నే చెప్పాలి. ఇందులో భాగంగా సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయ‌కుండా నిరోధించాలంటూ టీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి - ఆ పార్టీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌లు హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్ ను అత్య‌వ‌స‌ర పిటిష‌న్ గా ప‌రిగ‌ణించి త‌క్ష‌ణ విచార‌ణ చేప‌ట్టాల్సిందిగా పిటిష‌నర్లు హైకోర్టును అభ్య‌ర్థించారు.

అయితే ఈ పిటిష‌న్ ను అత్య‌వ‌స‌ర పిటిష‌న్ గా ప‌రిగ‌ణించేందుకు ఒప్పుకోని హైకోర్టు ధ‌ర్మాస‌నం... పార్టీ ఫిరాయింపుల‌దారుల‌కు గ‌ట్టి షాకిచ్చే కామెంట్ చేసింది. ఇత‌ర పార్టీల టికెట్ల‌పై ప్ర‌జా ప్ర‌తినిధులుగా విజ‌యం సాధించి టీఆర్ ఎస్‌ లోకి చేరిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రిగా ఉంటాయ‌ని హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య చేసింది. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఒక్క టీఆర్ ఎస్ నే కాకుండా పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్న టీడీపీ లాంటి పార్టీల‌కు కూడా షాకింగ్ గానే మార‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.