Begin typing your search above and press return to search.

రోజా ఇష్యూలో నిపుణులు ఏమంటున్నారు?

By:  Tupaki Desk   |   18 March 2016 5:52 AM GMT
రోజా ఇష్యూలో నిపుణులు ఏమంటున్నారు?
X
రోజా అసెంబ్లీ ఎంట్రీ వ్యవహారం వివాదంగా మారిన నేపథ్యంలో ఏపీ అధికార.. విపక్షాలు రెండు బలమైన వాదనల్ని వినిపిస్తున్నాయి. ఇక.. మీడియాలోనూ కొంత భిన్నాభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి.ఇలాంటి సమయంలో.. ఈ అంశంపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు? వారి వాదన ఏమిటి? అన్న అంశాల్లోకి వెళితే..

1. ఒక వివాదం మీద కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించి.. ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత వాటిని అమలు చేయాలి.

2. ఒకవేళ కోర్టు వెలువరించిన నిర్ణయాల మీద అభ్యంతరాలు ఉంటే అప్పీలుకు వెళ్లు హక్కు ఉంటుంది.

3. అప్పీలుకు వెళ్లినంత మాత్రాన అప్పటికే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయనని చెప్పే వీల్లేదు.

4. అప్పీలుకు వెళ్లి.. అక్కడ ఏదైనా భిన్నమైన ఉత్తర్వులు వెలువడితే వాటిని అమలు చేయాలి.

5. అంతే తప్ప.. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయకుండా ఉండటం ఏ మాత్రం సరికాదు.

6. అప్పీలు మీద ఆర్డర్ వచ్చే వరకు అంతకు ముందే వెలువరించిన పాత ఆర్డర్ ను తప్పనిసరిగా అమలు చేయాల్సిందే.

7. కోర్టు ఆర్డర్ ను ఏపీ అధికారపక్షం అమలు అనటం సరికాదు. దాన్నిస్పీకర్ ఆఫీసు శిరసా వహించాల్సి ఉంటుంది.

8. జ్యూడిషియరీ నిర్ణయాల్ని అమలు చేయమంటే.. మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు ఏం కావాలి?

9. జ్యూడిషియరీ ఇచ్చిన ఉత్తర్వుల మీద భిన్నాభిప్రాయం ఉంటే.. కోర్టులో తేల్చుకోవాలే తప్ప.. ఉత్తర్వుల్ని అమలు కాకుండా అడ్డుకోకూడదు.

10. జ్యూడిషియరీ.. లెజిస్లేచర్ మధ్య విభేదమా.. మరొకటా అన్నది చూడకుండా మొదట అయితే కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాలి.