Begin typing your search above and press return to search.
బ్రెజిల్ అధ్యక్షుడు - హీరో మధ్య అమెజాన్ కార్చిచ్చు
By: Tupaki Desk | 1 Dec 2019 12:48 PM GMTదక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ దేశంలో విస్తరించిన అమెజాన్ అడవులు అగ్నికి ఆహుతి అవ్వడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు.సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా దీనిపై స్పందించారు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో కావాలనే ఈ అడవులను హరించి పారిశ్రామిక వృద్ధికి ఊతం ఇస్తున్నాడని.. ఈ కార్చిచ్చు వెనుకాల అతడే ఉన్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. అమెజాన్ లో మంటలు చెలరేగడానికి ఎన్జీవో సంస్థ కారణమని.. దానికి హాలీవుడ్ హీరో డికాప్రియో 5 లక్షల డాలర్ల విరాళం అందించాడని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో ఆరోపించారు. హాలీవుడ్ హీరో డికాప్రియో ఆర్థిక సాయం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.
దీనిపై హాలీవుడ్ హీరో డికాప్రియో స్పందించాడు. అడవుల పరిరక్షణకు కృషి చేస్తున్న బ్రెజిల్ వాసులకు తాను మద్దతిస్తున్నానని.. అడవులు ప్రమాదాల బారిన పడకుండా నివారించే సంస్థలకే తాను అండగా ఉంటున్నానని వివరణ ఇచ్చాడు. బ్రెజిల్ అధ్యక్షుడు ఆరోపణలు సరికాదని కౌంటర్ ఇచ్చాడు. తాను పర్యవరణాన్ని కాపాడే ఎన్జీవో సంస్థలకు విరాళం ఇస్తున్నానని స్పష్టం చేశారు.