Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో చిరుత .. లారీ డ్రైవర్ అత్యుత్సాహం !
By: Tupaki Desk | 14 May 2020 11:30 AM GMTహైదరాబాద్ శివార్లలో ఓ చిరుతపులి ప్రజలను బెంబేలెత్తించింది. కాటేదాన్ ప్రాంతంలో కనిపించిన చిరుత స్థానికుల్ని భయపెట్టింది. గాయాలతో ఉన్న చిరుత ఎటూ కదలకుండా చాలా సేపు హైవే మీదే ఉండిపోయింది. అది రోడ్డు మీదే ఉందని తెలిసి కూడా చాలా మంది వాహనదారులు నిర్లక్ష్యంగా అటూ ఇటూ తిరిగారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ పరిధిలో కాటేదాన్ రైల్వే ట్రాక్ వద్ద ఉన్న ఎన్ హెచ్ 7 హైవేపై డివైడర్ ను ఆనుకొని ఒక చిరుతపులి గాయాలతో కూర్చొని ఉంది. కాగా చిరుతకు గాయాలు కావడంతో కదల్లేని పరిస్థితిలో ఉంది.
ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన సుభానీ అనే లారీ డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దానికి ఏమైందోనని దగ్గరికి వెళ్లి చూసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిరుతపులి లారీ డ్రైవర్ ను గాయ పరిచింది.ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని గాయపడిన లారీ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ఇరువైపుల ఉన్న రోడ్డును తమ పరిధిలోకి తెచ్చుకున్న పోలీసులు చిరుతపులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే మత్తు మందు ఇచ్చేలోపే చిరుత అక్కడి నుంచి పారిపోయింది. దీంతో చిరుతను ఎలాగైనా పట్టుకొని తీరుతామని అధికారులు తెలిపారు. పొలాల్లోకి పారిపోయిన చిరుత ఆచూకీ కోసం అధికారులు డ్రోన్లను వినియోగించనున్నారు. ఓవైపు ఈ వైరస్ మహమ్మారితో వణికిపోతున్న నగర శివారు ప్రజలకు.. తాజాగా చిరుత భయంపట్టుకుంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.