Begin typing your search above and press return to search.
ఆ మహిళా ఎంపీ ఇంటికి చిరుత!
By: Tupaki Desk | 13 Jan 2018 10:12 AM GMTసగటు జీవి ఇంటి ముందుకు చిరుత వస్తే అధికారుల స్పందన ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ.. అదే చిరుత ఒక ఎంపీ ఇంటి ముందుకు వస్తే.. ఉరుకులు పరుగులు తీయాల్సిందే. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుంది.
బాలీవుడ్ సీనియర్ నటి.. బీజేపీ ఎంపీ హేమమాలిని ఇంటి ఎదుటకు ఒక చిరుత వచ్చింది. అప్పటివరకూ గాఢ నిద్రలో ఉన్నాడో ఏమో కానీ.. చిరుతను చూసి కుక్క అనుకొని దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు అక్కడి సెక్యురిటీ సిబ్బంది. అయితే.. తాను తరుముతున్నది కుక్కను కాదని.. చిరుతనన్న విషయాన్ని గుర్తించిన అతగాడు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాడు.
కాస్త వెనక్కి తగ్గి.. అటవీ అధికారులకు ఫోన్ చేశాడు. అధికార పార్టీ ఎంపీ ఎదుట చిరుత తిరుగుతుంటే అధికారులకు ఇక నిద్రేం ఉంటుంది? పరుగున వచ్చి ఎంపీ ఇంటి ముందుకు వచ్చి వాలారు. చిరుతను పట్టుకునే ప్రయత్నం చేయగా అది తప్పించుకుంది. దీంతో.. చిరుతను పట్టుకోవటం కోసం అధికారులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో.. చిరుతను తరిమే సమయంలోనే.. దాన్ని బంధించే సమయంలో దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్న అధికారులు.. చిరుత ఎదురుపడితే ఏం చేయాలో.. ఏం చేయకూడదో వివరిస్తున్నారు. ఎందుకైనా మంచిది హేమమాలిని మేడమ్‌కు కూడా ఈ సలహాలు.. సూచనలు చెబితే మంచిదేమో?3.