Begin typing your search above and press return to search.
ఇక లేపాక్షి కాదు.. గోల్కొండ
By: Tupaki Desk | 7 Oct 2015 5:46 AM GMTతెలంగాణ రాష్ట్ర సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం హస్తకళల అభివృద్ధి కేంద్రాలకు.. హస్త కళల వస్తువుల్ని అమ్మే షోరూంలను లేపాక్షి పేరుతో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర విభజనలో భాగంగా.. ప్రతి చోటా తెలంగాణ ముద్ర ఉండేలా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ సర్కారు.. తాజాగా హస్తకళల అభివృద్ధి సంస్థను లేపాక్షి స్థానే గోల్కొండగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో ఇంతకాలం లేపాక్షి పేరుతో దర్శనమిచ్చిన షోరూంలు అన్నీ కూడా ఇకపై గోల్కొండ గా కనిపించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లేపాక్షి పేరు మీదున్న షోరూంలన్నీ గోల్కొండగా మారనున్నాయి.
దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. హస్త కళల సంస్థకు మంచి పేరు పెట్టాలని అధికారులు కోరి.. పలు పేర్లను ప్రతిపాదించారు. అయితే.. అధికారులు సూచించిన పేర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నచ్చలేదు. దీంతో.. ఆయన గోల్కొండ పేరును చెప్పగా.. అందుకు అధికారులు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన గోల్కొండ పేరు బాగుందని చెప్పటంతో.. ఆ పేరునే అధికారికం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.