Begin typing your search above and press return to search.
లెస్బియన్ జంట పెళ్లి ఫోటో షూట్.. చివర్లో ట్విస్ట్..!
By: Tupaki Desk | 30 Nov 2022 5:16 AM GMTకేరళకు చెందిన లెస్బియన్ జంట పెళ్లి ఫోటో షూట్ నిర్వహించారు. పూలదండలు.. రింకులు మార్చుకొని ఒక్కటయ్యారు. వీరిద్దరి సంబంధించిన ఫోటోలను లెస్బియన్ జంట తమ ఇన్ స్టా.. ఫేస్ బుక్ అకౌంట్లలో పోస్ట్ చేయగా అవికాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే లెస్బియన్ జంట పెళ్లిపై నెటిజన్ల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
లెస్బియన్ జంట పెళ్లి ఫోటో షూట్ కు ముందు పెద్ద పోరాటమే చేశారు. తల్లిదండ్రులను ఎదిరించి పారిపోవడం దగ్గర నుంచి తమను కలిసి ఉండేలా న్యాయం చేయాలని కోర్టు మెట్లు ఎక్కడం.. కోర్టు నుంచి వారికి అనుకూలంగా తీర్పు రావడం లాంటి ఘటనలన్నీ కూడా సినీ ఫక్కీలో జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ లెస్బియన్ జంట అసలు కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
కేరళలోని కోజికోడ్ కు చెందిన అదిలా.. ఫాతిమా చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. యుక్త వయస్సుకు వచ్చే సమయానికి వీరి మధ్య ప్రేమ పుట్టింది. దీంతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పగా వారు అంగీకరించకపోవడంతో 2022 మేలో ఇంటి నుంచి పారిపోయారు. ఈ క్రమంలోనే ఓ వార్ షెల్డర్ హెడ్ లో కొన్ని రోజులు నివాసం ఉన్నారు.
వీరిద్దరి ఆచూకీ తెలుసుకున్న పెద్దలు వారి వద్దకు వెళ్లి ఆ జంట కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. తీరా ఇంటికి వచ్చాక ఇరువురి తల్లిదండ్రులు వారిని విడదీశారు. దీంతో తమకు కలిసి జీవించే హక్కు కల్పించాలని కేరళ హైకోర్టును ఫాతిమా ఆశ్రయించారు. కోర్టు తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. అయితే ఈ తీర్పు వారి తల్లిదండ్రులకు నచ్చలేదు.
దీంతో అదిలా.. ఫాతిమాలు పేరంట్స్ ను వదిలేసి మరొచోట కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా వీరివురు పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలపై లెస్బియన్ జంట స్పందిస్తూ.. తాము కేవలం పెళ్లి ఫొటో షూట్ మాత్రమే జరుపుకున్నామని.. ఇంకా పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.
అయితే తమకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాత్రం ఉందని స్పష్టం చేశారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో తాము ఆనందంగా కలిసి జీవిస్తున్నామని తెలిపారు. తమ వల్ల ప్రపంచమేమీ మారిపోవడం లేదని.. మేమేమీ విషాన్ని వెదజల్లడం లేదని ఫాతిమా తెలిపింది. ఇక వీరిద్దరు పెళ్లి ఫొటోలకు ఆ జంట ''అనుకున్నది నెరవేరింది.. కలిసుంటాం ఎప్పటికీ'' అంటూ కాప్షన్ ఇవ్వడం విశేషం. కాగా వీరిద్దరు పెళ్లి చేసుకున్నప్పటికీ తల్లిదండ్రులకు భయపడి చెప్పడం లేదని ప్రచారం జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.