Begin typing your search above and press return to search.
ఆ టాప్ నటుడ్నిబుక్ చేసిన లెటర్ లో ఏముంది?
By: Tupaki Desk | 12 July 2017 7:04 AM GMTప్రముఖ మలయాళ నటిని కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి గురి చేసిన ఉదంతం గురించి తెలిసిందే. దేశ వ్యాప్తంగా తీవ్రసంచలనం సృష్టించిన ఈఉదంతానికి సంబంధించి రెండు రోజుల క్రితం మలయాళ సినీరంగంలో పేరు మోసిన ప్రముఖ నటుడు దిలీప్‌ను అరెస్ట్ చేయటం.. అతడే.. సదరు హీరోయిన్ మీద ఆ రకమైన దాడికి ప్లాన్ చేసిన విషయం బయటకు వచ్చింది. ఈ పరిణామం మలయాళ చిత్రపరిశ్రమను భారీ షాక్ గా మారటమే కాదు.. చిత్ర పరిశ్రమకు చెందిన వారు అందులో నుంచి బయటకు రాలేకపోతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏ లేఖ అయితే తనను సేవ్ చేస్తుందని ప్లాన్ చేసి పోలీసులకు ఇచ్చిన దిలీప్.. అదే లేఖ కారణంగానే అరెస్ట్ అయ్యారని చెబుతున్నారు. నటిని వేధింపులకు గురి చేసిన కేసులో అరెస్ట్ అయిన పల్సర్ సునీల్ తనను బెదిరిస్తున్నాడని.. తనకులేఖ పంపాడంటూ దిలీప్ పోలీసులకు సమాచారం అందించి లేఖను ఇచ్చాడు. ఇప్పుడు అదే లేఖ ఆధారంగా దిలీప్ ను అరెస్ట్ చేశారు.
పల్సర్ సునీల్ తనకు ఎవరో తెలీదని.. అతడితో పరిచయం అస్సలు లేదని దిలీప్ నమ్మ బలికిన నేపథ్యంలో పోలీసులకు ఏమీ పాలుపోలేదు. అయితే.. పల్సర్ సునీల్ తో దిలీప్ సన్నిహితంగా దిగిన సెల్ఫీ ఒకటి బయటకు రావటం.. దాని ఆధారంగా పావులు కదిపిన పోలీసులకు కావాల్సిన సమాచారం మొత్తం అందింది. దీంతో.. దిలీప్‌ను అరెస్ట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు పోలీసులు. దిలీప్ అరెస్ట్ లో కీలకభూమిక పోషించిన లేఖలో అసలు ఏముంది? అందులో పల్సర్ సునీల్ ఏం రాశారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఒక ప్రముఖ మీడియా సంస్థ ఈ లేఖను ప్రచురించింది. అందులోని అంశాల్ని చూస్తే.. లేఖలో చాలానే మ్యాటర్ ఉందనిపించక మానదు.
దిలీప్ గారికి.. నేను సునీల్‌ను. ఈ ఉత్తరం నేను జైలు నుంచిరాస్తున్నా. అతి కష్టమ్మీద మీకు దీనిని పంపుతున్నా. ఈ ఉత్తరం తీసుకొచ్చే వ్యక్తికి ఈ కేసు గురించి ఏమీ తెలీదు. నేను చెప్పానని వచ్చి మీకు ఇస్తున్నాడంతే. ఈ కేసు తీవ్రత నాకు అర్థమువుతోంది. ఇందులో నుంచి నన్నుఎవరూ కాపాడలేరని కూడా తెలుస్తోంది. నా గురించి బాధ లేదు. అయితే.. నన్ను నమ్మి.. నాతో కలిసి పని చేసిన ఐదుగురు వ్యక్తుల గురించే నా దిగులంతా.
నేను నోరు తెరిచి నన్ను ఈ పనికి నియమించిన వ్యక్తి పేరు బయట పెడితే ఏమవుతుందో కూడా నాకు తెలుసు అన్నీ తెలిసి కూడా తప్పు నువ్వు ఒక్కడివే ఎందుకు ఒప్పుకుంటున్నావని.. బలిపశువు ఎందుకు అవుతున్నావని చాలామంది అడుగుతున్నారు. ఆ నటికి సంబంధించిన వ్యక్తులు.. నీ శత్రువులు నాకు టచ్ లో ఉన్నారు.మీరు ఎవరన్నా లాయర్ ని పంపి ఉంటే నా పరిస్థితి అర్థమై ఉండేది. కానీ మీరు అలా చేయలేదు.
నేను కొన్ని విషయాలు మాట్లాడదామని నాదర్షాకు కబురు చేశాను. కానీ.. ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. మీకు ఎందుకు నేను ఫోన్ చేయలేదో మీకు తెలుసు. నన్ను ఏం చేయ్యమంటారో చెప్పండి. మీరు నన్ను స్నేహితునిగా చూస్తున్నారో.. శత్రువుగా చూస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. నాకు కావాల్సింది డబ్బు. మీరు ఎవరినైనా సులభంగా నా దగ్గరకు పంపొచ్చు. ఈ లెటర్ అందిన మూడు రోజుల వరకూ వెయిట్ చేస్తాను. ఆ లోపల మీ నిర్ణయం నాకు తెలియాలి.
నేను ఏ పరిస్థితుల్లో ఈ ఉత్తరం రాస్తున్నానో మీరు అర్థం చేసుకోండి. వచ్చే వారం నేను వేరే లాయర్‌ని పెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరే నిర్ణయం తీసుకోండి. నాకు ఇస్తానని ప్రామిస్ చేసిన డబ్బంతా ఇప్పుడే ఇవ్వమని చెప్పటం లేదు. ఐదు నెలల్లో ఆ డబ్బు ఇవ్వండి. నాదిర్షాకు కబురు చేస్తాను. అప్పటికల్లా అతని ద్వారా సమాధానం ఇవ్వండి. ఒకవేళ నాదిర్షాతో ఈ వ్యవహారం జరగటం ఇష్టం లేకపోతే.. రూ.300 మనియార్డర్ నాకు పంపండి. నాకు అందితే మీరు నన్ను మోసం చేయటం లేదని అర్థమవుతుంది (అని అడ్రస్ ఇచ్చారు). ఇంతకంటే ఎక్కువ వివరాలు రాయదలుచుకోలేదు. నేను ఇంకా జైల్లోనే ఉన్నానన్న విషయం మర్చిపోవద్దు. నా పేరు చెప్పుకొని ఎవరైనా మీ దగ్గరకు వస్తే వాళ్లను నమ్మొద్దు. మీకు ఏమన్నా చెప్పాలనిపిస్తే ఈ ఉత్తరం తెచ్చిన విష్ణుకి చెప్పండి. మీరు ఈ ఉత్తరం చదువుతున్న ఈ క్షణం వరకూ మీ సంగతి నేనెక్కడా బయటపెట్టలేదు. మీరు సేఫ్ గా ఉండాలన్నదే నా కోరిక. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. నాకు డబ్బు అవసరం. ఉత్తరం చదివాక మీ నిర్ణయం ఏంటో చెప్పండి. మరికొన్ని వివరాలతో మరో ఉత్తరం మీకు రాస్తాను.