Begin typing your search above and press return to search.
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లకు ‘లెటర్లు’ వచ్చేశాయ్
By: Tupaki Desk | 4 Feb 2021 2:10 PM GMTపోటాపోటీగా సాగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రావటం.. ఆ హడావుడి చల్లారిపోవటం తెలిసిందే. షెడ్యూల్ కంటే ముందే జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లు.. రూల్ బుక్ ప్రకారం వెంటనే ప్రమాణస్వీకారం చేసే పరిస్థితి లేదు. దీనికికారణం.. అంతకు ముందు ఎన్నికైన వారి ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కాకపోవటమే. అయితే.. వారి పదవీ కాలం ఈ నెల 10న పూర్తి అవుతోంది. దీంతో.. వారి ప్రమాణస్వీకారాన్ని ఆ తర్వాతే నిర్వహించాల్సిన పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఈ రోజు గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు అందరికి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వ్యవహరించనున్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి లేఖలు రాశారు. వారంతా.. ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు రావాలని కోరారు. ఆ రోజున ప్రమాణస్వీకారం ఉంటుందని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. గెలిచిన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం.. ఆ వెంటనే మేయర్.. డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించాల్సి ఉంది.
అయితే.. మేయర్ ఎన్నికకు అవసరమైన కోరం హాజరు కాకుంటే.. తర్వాత మరోసారి నిర్వహిస్తారు. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే.. ఫిబ్రవరి 11న అమావాస్య కావటంతో గెలుపొందిన కార్పొరేటర్లు తెగ ఫీలైపోతున్నారు. అమావాస్య రోజున ప్రమాణస్వీకారం చేయాలా? అన్నది వారి సందేహం. ఒకవేళ ఆ రోజు చేయకున్నా.. తర్వాత రోజు చేసే అవకాశం ఉంది. కానీ.. మేయర్ ఎన్నిక అదే రోజుజరిగే అవకాశం ఉండటంతో.. అధిష్ఠానం చెప్పినట్లుగా ప్రమాణస్వీకారం చేయాలే తప్పించి.. తమకు నచ్చినట్లుగా చేసే అవకాశం లేదన్న వాదనను వినిపిస్తున్నారు.
మరికొందరు మాత్రం.. అమావాస్య లేదు పౌర్ణమి లేదు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రమాణస్వీకారం డేట్ వచ్చేసిన తర్వాత ఇంక ఆగే ప్రసక్తే లేదని తేల్చేసేవాళ్లు ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు దగ్గరకు వచ్చేసిన విషయాన్ని తాజా లేఖ చెప్పేయటంతో గ్రేటర్ రాజకీయాల్లో సందడి వాతావరణం నెలకొందని చెప్పక తప్పదు.