Begin typing your search above and press return to search.

బక్కపల్చటి యువసైనికాధికారి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడెందుకు?

By:  Tupaki Desk   |   26 Jun 2020 12:30 AM GMT
బక్కపల్చటి యువసైనికాధికారి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడెందుకు?
X
తొండి వాదనకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు చైనా అధికారులు. పై నుంచి వచ్చే ఆదేశాలో.. సొంతంగా చేస్తారో కానీ.. అదే పనిగా కవ్వించే తీరు వారిలో పుష్కలం. తాజాగా చోటు చేసుకున్న ఘర్షణ.. పర్యవసానాల గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే.. చైనా అధికారులకు లద్దాఖ్ సరిహద్దుల్లో సంతోష్ బాబు నాయకత్వంలో సైనికుల వీరోచిత పోరాటం తెలిసిందే. మనోళ్ల తెగువకు చైనీయులు తోక ముడిచిన వైనం మరవక ముందే.. సిక్కింలో చోటు చేసుకున్న ఒక ఉదంతం తాజాగా వెలుగు చూసింది.

ఒక యువ సైనికాధికారి వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం సిక్కిం సరిహద్దుల్లో చైనా సైనికులు ఒకరు చేసిన అతికి.. దిమ్మ తిరిగే షాకిచ్చాడో బక్కపల్చటి యువ అధికారి. చూసేందుకు పుల్లలా ఉండే అతగాడిలో నిలువెత్తు ధైర్యం మాత్రమే కాదు.. దేశాన్ని తక్కువ చేసి ఒక్క మాట మాట్లాడినా..అవతల వారికి మూడినట్లే. దీనికి సంబంధించిన సమాచారం తాజాగా ఉన్నత సైనికాధికారులకు చేరటం.. తర్వాత అతగాడు చేసింది మంచి పనే అని తేల్చారు. ఇంతకీ ఆ సైనికాధికారి ఎవరు? అతడి విశేషాలు ఏమిటన్న విషయంలోకి వెళితే..

సదరు యువ సైనికాధికారి పేరు బిరోల్ దాస్. మూడేళ్ల క్రితం ఎన్డీయేకు ఎంపికైన అతగాడు శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ట్రైనింగ్ లో మంచి పేరును సొంతం చేసుకున్న ఇతగాడి ఫ్యామిలీ మొత్తం ఆర్మీలోనే పని చేస్తుండటం గమనార్హం. చివరికి అతగాడి సోదరి సైతం ఆర్మీలోనే చేస్తుందంటే.. సైన్యంలో పని చేసే విషయంలో కుటుంబం మొత్తం ఒకేలాంటి కమిట్ మెంట్ ను ప్రదర్శిస్తారని చెబుతారు.

కొంతకాలం క్రితమే భారత యువ సైనికాధికారిగా విధుల్లోకి చేరిన అతగాడు.. చైనా మూకలకు దిమ్మ తిరిగేలా షాకిచ్చాడు. భారత సరిహద్దుల్లోకి రావటమే కాదు.. గస్తీలో ఉన్న భారత్ లెఫ్టినెంట్ కు వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడాడు. దాన్ని చూసిన ఆ టీం లీడర్ కు కోపం తన్నుకొచ్చింది. తమ దేశ సరిహద్దుల్లోకి అడుగు పెట్టటమే కాదు.. తమ సైనికులను బెదిరిస్తున్న వైనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. లాగి పెట్టి చైనా మేజర్ కు ఒక్కటిచ్చిన దెబ్బకు.. ముక్కు పంక్చర్ కావటమే కాదు.. రక్తం కారింది.

ఈ ఊహించని పరిణామానికి షాక్ తిన్న చైనా సైనికులు వెనక్కి మళ్లారు. ఈ ఉదంతానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న సైనికాధికారులు తొలుత కంగారు పడ్డారు. దీని కారణంగా రెండు దేశాల మధ్య కొత్త ఉద్రక్తలు ఎదురవుతాయన్న ఆలోచన లో పడ్డారు. అయితే..వాస్తవాల్ని పరిశీలించిన వారు.. సదరు యువ సైన్యాధికారి చేసిన పనిని ప్రశంసిస్తూ.. సరైన నిర్ణయం తీసుకున్నట్లు గా తేల్చారు. ఈ విషయం బయట కు రావటం తో సదరు యువ సైనికాధికారి ఇంటికి వెళ్లిన మీడియా సభ్యులు.. ఆయన వ్యవహరించిన తీరును ప్రస్తావించి.. స్పందించాలని వారి తల్లిదండ్రుల్ని కోరారు. అందుకు వారు ఒప్పుకోక పోవటం గమనార్హం. మూర్తి భవించిన దేశ భక్తికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది సదరు యువ సైన్యాధికారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశం ఇప్పుడు వైరల్ గా మారింది.