Begin typing your search above and press return to search.

రోడ్డెక్కిన లెక్స‌స్ న్యూ మోడ‌ల్‌ కార్‌.. రేట్ ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   10 March 2021 2:30 AM GMT
రోడ్డెక్కిన లెక్స‌స్ న్యూ మోడ‌ల్‌ కార్‌.. రేట్ ఎంతో తెలుసా?
X
కారు ఏదైనా రెండే కార‌ణాల‌తో కొనుగోలు చేస్తుంటారు వినియోగ‌దారులు. ఒక‌టి సొసైటీలో హోదా చూపించుకోవ‌డానికి, రెండోది అందు‌లోని ల‌గ్జ‌రీని అనుభ‌వించ‌డానికి. ఈ క్ర‌మంలోనే ప్ర‌తీ కంపెనీ.. సాధార‌ణ వినియోగ‌దారుల కోసం కార్లు త‌యారు చేస్తూనే.. ల‌గ్జ‌రీ పీపుల్ ను సంతృప్తి ప‌ర‌చ‌డానికి ర‌క‌ర‌కాల వెరైటీస్ ను రోడ్డెక్కిస్తుంటాయి.

ప్ర‌ముఖ వాహ‌న త‌యారీ సంస్థ లెక్స‌స్ తాజాగా.. స‌రికొత్త మోడ‌ల్ ను లాంఛ్ చేసింది. ల‌గ్జ‌రీ కార్ల‌ను రూపొందించే సంస్థ‌ల్లో అగ్ర‌గామిగా ఉన్న ఈ సంస్థ‌.. LC500h పేరుతో న్యూ మోడ‌ల్ ను బ‌య‌ట‌కు తీసింది. ఇండియ‌న్ మార్కెట్లో లిమిటెడ్ ఎడిష‌న్ గా ఉన్న ఈ కారును ఎయిర్ రేసింగ్ ఎయిరో డైన‌మిక్ టెక్నాల‌జీతో త‌యారు చేసిన‌ట్టు కంపెనీ ప్ర‌క‌టించింది.

ఈ కారు స్టార్టింగ్ ప్రైస్ రూ.2.15 కోట్లు. ఇందులో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఈ కారు ఎల్లాయ్ వీల్స్ రియ‌ర్ వింగ్‌తో అదరగొడుతున్నాయి. ఇక‌, స్టీరింగ్ నుంచి బాడీ షేప్ వర‌కూ అన్నీ ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. మ‌రి, ఇండియ‌న్స్ ను ఈ కారు ఏ మేర‌కు ఆక‌ర్షిస్తుందో చూడాలి.