Begin typing your search above and press return to search.

ఎన్‌జీటీ ..రూ.50 కోట్లు డిపాజిట్ చేసిన ఎల్జీ పాలిమ‌ర్స్‌!

By:  Tupaki Desk   |   16 May 2020 9:15 AM GMT
ఎన్‌జీటీ ..రూ.50 కోట్లు డిపాజిట్ చేసిన ఎల్జీ పాలిమ‌ర్స్‌!
X
ఒకవైపు మహమ్మారితో దేశం మొత్తం అల్లాడి పోతున్న నేపథ్యం లో విశాఖపట్నం లో గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న జరగడం దురదృష్టకరం. విశాఖలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ఘటన లో ఇప్ప‌టికే 12 మంది మృతి చెంద‌గా, 350 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ ప్యాక్ట‌రీ ప‌రిస‌రాల‌లో ఉన్న అయిదు గ్రామాల ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల‌లో జీవిస్తున్నారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత ఇటువంటి విష లిక్విడ్ వినియోగించే 20 కర్మాగారాల్లో తనిఖీలు చేయ‌వ‌ల‌సిందిగా ప్ర‌భుత్వం పొల్యుష‌న్ కంట్రోల్ బోర్డుని ఆదేశించింది.

దీనితో ప‌లు బృందాలు ప్ర‌స్తుతం విశాఖ‌లోని ప‌లు కంపెనీలలో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌కు సంబంధించి ఎల్జీ పాలిమ‌ర్స్ యాజ‌మాన్యం ముంద‌స్తు ఆర్థిక సాయం అంద‌జేసింది. మే నెల‌7వ తేదీన జరిగిన విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటనకు సంబంధించి ఎన్‌ జీటీ ఆదేశాల మేరకు శుక్రవారం పాలిమర్స్‌ యాజమాన్యం స్పందించింది. ఆ పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ వాడ్రేవుల వినయ్ ‌చంద్‌ ను కలిసి రూ.50 కోట్ల చెక్కును కలెక్టర్‌ కార్యాలయంలో డిపాజిట్‌ చేశారు.

దీనిపై జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ మాట్లాడుతూ ఎన్ ‌జిటి ఆదేశాల మేరకు పాలిమర్స్‌ యాజమాన్యం రూ.50 కోట్లు డిపాజిట్‌ చేసిన విషయం నిజమే అని తెలిపారు. ఈ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. అలాగే , తదుపరి ఎన్‌ జిటి ఆదేశాల ప్రకారం వీటిని వినియోగించడం జరుగుతుంది అని చెప్పారు. ఎల్ ‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ విషయమై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తక్షణమే రూ.50 కోట్ల రూపాయలను మందస్తుగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.