Begin typing your search above and press return to search.
విశాఖ గ్యాస్ ప్రభావం.. ఎన్ని ఏళ్లు.. ఏంత డేంజర్?
By: Tupaki Desk | 11 May 2020 1:30 AM GMTవిశాఖలోని ఎల్.జీ పాలిమర్స్ పరిశ్రమ వెదజల్లిన స్టైరిన్ గ్యాస్ ప్రకృతిని నాశనం చేసింది. ఇప్పుడక్కడంతా విషతుల్యం అయిపోయిందని నిపుణులు తేల్చారు. అవును త్రాగే నీరు, ఆహారం, భూమి, ఆకాశం, వాయువు, జలం కలుషితమైనట్టు తేల్చారు. కొన్ని సంవత్సరాలు ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.
విశాఖ గ్యాస్ ప్రభావం ఇప్పట్లో తగ్గిపోయే పరిస్థితులు కనిపించడం లేదు.పండించే పంట నుంచి భూగర్భంలోని నీరు వరకు కలుషితమైనట్టు నిపుణులు తేల్చారు. గాలి సైతం కలుషితమైంది. అవన్నీ సామాన్య స్థితికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్క్డడ జీవకోటి మనుగడకు ముప్పు ఉందంటున్నారు.
ఆ ప్రాంతంలో పండిన పంటలు తినేందుకు అనుకూలం కాదని.. బావుల్లో నీరు తాగడానికి, వాడడానికి పనికి రావని తేల్చారు. పెద్ద ఎత్తున వర్షం వచ్చి నీరు కొట్టుకుపోవడం.. నీరు ఎండిపోవడం గానీ జరిగితే విషవాయువు ప్రభావం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
స్టైరీన్ గ్యాస్ పాలిమర్ గా మారుతోందని.. అది శరీరంలో చేరితే విషవాయువును ఉత్పత్తి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విశాఖ ప్రభావిత ప్రాంతాల్లో కూరగాయలు - పండ్లు - ఆకుకూరలు - కాయలు అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. మూతలేకుండా ఉన్న ట్యాంకుల్లో నీరు కూడా ప్రమాదమని.. నీటిని అస్సలు వినియోగించకూడదని చెబుతున్నారు. విషవాయువు ప్రభావితమైన నీరు తాగితే కిడ్నీ - లివర్ - గుండె రక్తనాళాల సమస్యలు వేగంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ కాలం ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.