Begin typing your search above and press return to search.
లి మెంగ్ యాన్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ .. కారణం ఏంటంటే ?
By: Tupaki Desk | 17 Sep 2020 11:10 AM GMTప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి విషయంలో అమెరికా వంటి అగ్రదేశాలు చైనా పైనే ఆరోపణలు చేసింది. వైరస్ చైనా ల్యాబ్ లో తయారైందని..ఇది చైనా కుట్ర అంటూ విమర్శలు చెలరేగాయి. ఈ విషయంపై చాలా వాదోపవాదాలు జరిగాయి. తాజాగా హాంకాంగ్ కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ లి మెంగ్ యాన్ సంచలనం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వూహాన్ ల్యాబ్ లో తయారైందంటూ సంచలన ఆరోపణలు చేసింది. హాంకాంగ్ దేశపు ప్రముఖ సైంటిస్టుల్లో ఒకరైన డాక్టర్ లి మెంగ్ యాన్...వైరస్ విషయంలో మొదట్నించీ ఇదే విషయం చెబుతున్నారు. ఇప్పుడు ఆధారాలున్నాయంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవల ఆమె హాంకాంగ్ నుంచి అమెరికాకు తరలివచ్చేశారు.
ఇదిలా ఉన్న సమయంలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ ఆమెకు షాక్ ఇచ్చింది. తన అకౌంట్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. యాన్ ఖాతాను మంగళవారం తొలగించినట్లు డైలీ మెయిల్ లోని ఒక నివేదిక తెలిపింది. ఆమె ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేయబడింది అనే మెసేజ్ వచ్చింది. నిబంధనలను ఉల్లంఘించే వారి ఖాతాలను ట్విట్టర్ నిలిపివేస్తుంది. అయితే యాన్ అకౌంట్ ని సస్పెండ్ చేయడంపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు. కరోనా వైరస్‌కు సంబంధించి అవాస్తవ సమాచార వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని మైక్రోబ్లాగింగ్ సైట్ మే నెలలో హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం యాన్ ఉల్లంఘించిన ట్విట్టర్ నియమాలు ఏంటనే దానిపై వివరణ లేదు. సెప్టెంబర్ 11న ఓ షోలో ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌పై చేసిన పరిశోధనలు.. తాను ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పంచుకున్నారు.