Begin typing your search above and press return to search.

111మంది ప్రయాణికులున్న విమానం హైజాక్!

By:  Tupaki Desk   |   23 Dec 2016 1:00 PM GMT
111మంది ప్రయాణికులున్న విమానం హైజాక్!
X
విమానం హైజాక్... ఈ మాట ప్రపంచంలో ఏ మూలన విన్నా అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఆ స్థాయిలో గాల్లో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలతో గాళ్లో చెలగాటమాడుతూ, వారి ప్రాణాలను గాళ్లోనే కలిపేస్తామని బెదిరించే దుండగుల పనే ఈ హైజాక్. కొన్ని సందర్భాల్లో హైజాక్ చేసిన విమానాలను ఆత్మాహుతి తళాలు పేల్చేస్తుండగా, మరి కొన్ని సందర్భాల్లో ఈ హైజాక్ ను అడ్డుపెట్టుకుని తమకు కావాల్సిన పనులు చేయించుకుంటారు ఉగ్రవాదులు. తాజాగా లిబియా అంతర్గత విమానాన్ని ఇద్దరు దుండగులు హైజాక్ చేశారని తెలుస్తుంది.

అవును లిబియా ప్రభుత్వ రంగ సంస్థ ఆఫ్రికియా ఎయిర్ వేస్ కు చెందిన "ఎయిర్ బస్-320" అనే విమానాన్ని శుక్రవారం హైజాక్ చేశారు. మొత్తం ఏడుగురు సిబ్బంది, 111మంది ప్రయాణికులుతో బయలుదేరిన ఆ విమానాన్ని దారి మళ్లించి మాల్టాలో ల్యాండ్ చేశారని, అనంతరం ఆ విమానాన్ని పేల్చేస్తామని బెదిరిస్తున్నారని మాల్టీస్ మీడియా పేర్కొంది. ఇదే విషయాన్ని మాల్టీస్ ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ కూడా ట్విట్టర్ ద్వారా దృవీకరించారు. దీంతో విమానం హైజాక్ అయ్యిందన్న విషయం నిర్ధారణయ్యింది. ఈ విమానంలోని ప్రయాణిస్తున్న 111 మందిలో 82మంది పురుషులు, 28 మంది మహిళలతో పాటు ఒక శిశువు ఉన్నట్లు ప్రధాని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

నైరుతీ లిబియా సబా నుంచి ట్రిపోలీ వెళ్తుండగా హైజాకర్లు ఈ విమానాన్ని దారి మళ్లించారు. దీంతో మాల్టా ఎయిర్‌ పోర్టులో హైఅలర్ట్ ప్రకటించడంతో పాటు కొన్ని విమానాలను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. హైజాకర్ల వివరాలు, డిమాండ్లు వంటి విషయాలు ఇంకా తెలియాల్సి వుంది.