Begin typing your search above and press return to search.
బెజవాడ లో హెల్మెట్ లేకుండా బండి నడిపితే లైసెన్స్ సస్పెండ్
By: Tupaki Desk | 18 Dec 2019 6:54 AM GMTఅంతకంతకూ పెరిగి పోతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యం లో ఏపీ రవాణా శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఏడాది మొదటి రోజు (జనవరి 1 నుంచి) నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. దీని ప్రకారం బెజవాడ రోడ్ల మీద టూవీలర్ ను హెల్మెట్ లేకుండా నడిపితే.. వారి డ్రైవింగ్ లైసెన్స్ లను సస్పెండ్ చేయాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ప్రతి వందమందిలో ముప్ఫై మంది హెల్మెట్ లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గుర్తించిన ఏపీ రవాణా శాఖ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విజయవాడలో ఐదు లక్షల టూవీలర్స్ ఉన్నాయి. ఇందులో 60 శాతం మంది వాహనదారులు హెల్మెట్ లేకుండానే బండ్ల ను తీసుకొని రోడ్ల మీదకు వస్తున్నారు.
ఈ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాల కు గురికావటం.. ప్రాణాలు పోవటం జరుగుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు వీలుగా తాజాగా కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. జనవరి ఒకటి నుంచి విజయవాడ రోడ్ల మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు పోలీసులు. ఎవరైనా హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపితే వారి మీద కేసులు నమోదు చేయటంతో పాటు.. నెల రోజుల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేశారు. అదే తప్పు మరోసారి రిపీట్ అయితే.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేయటమే కాదు.. వాహనాన్ని సైతం సీజ్ చేయనున్నారు. మొత్తానికి జనవరి ఒకటి నుంచి బెజవాడలో టూ వీలర్ వాడాలంటే తలకు హెల్మెట్ తప్పనిసరి. లేకుంటే తిప్పలు తప్పవంతే.