Begin typing your search above and press return to search.
ప్రైవట్ కోవిడ్ సెంటర్లకు షాకిచ్చిన జగన్ సర్కార్
By: Tupaki Desk | 4 Sep 2020 12:30 PM GMTతాజాగా తెలంగాణలో ఓ బాలింతకు కరోనా ఉన్న చికిత్స పేరుతో కాలయాపన చేసి 29 లక్షలు కట్టించుకొని శవాన్ని కూడా ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన ఓ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాకం బయటపడింది. కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు దోచుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఏపీలోనూ ప్రైవేట్ కోవిడ్ సెంటర్లపై ఫిర్యాదులొచ్చాయి. రమేశ్ ఆసుపత్రిలో 12మంది కరోనా రోగులు సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ సీరియస్ అయ్యింది.
విజయవాడలోని 22 ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్స్ ను రద్దు చేసింది. నాలుగు రోజుల క్రితం డీఎంహెచ్.వో డా. రమేశ్ రిటైర్ అయ్యారు. ఆయన అనుమతులు ఇచ్చిన 13 సెంటర్ల లైసెన్స్ లను ఆయనే రద్దు చేయడం వివాదాస్పదంగా మారింది.
ఈ క్రమంలోనే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా టెస్టులు నిర్వహించిన మరో 9 సెంటర్ల లైసెన్స్ లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రైవేట్ సెంటర్ల నిర్వహణలో రూ. లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ కొరఢా ఝలిపించింది..