Begin typing your search above and press return to search.

భారత్-చైనా మధ్య యుద్ధమేఘాలు..!

By:  Tupaki Desk   |   5 Jun 2020 11:50 AM GMT
భారత్-చైనా మధ్య యుద్ధమేఘాలు..!
X
భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంటోంది. కశ్మీర్ పక్కనున్న లఢక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారత్-చైనా సైన్యాలు భారీ మోహరించాయి. లఢక్ సమీపంలోని పాంగాంగ్, గాల్వాన్ లోయలో భారత్-చైనా ఆర్మీలు బాహాబాహీ తలపడేలా సీన్ ఉంది.

పరిస్థితులు చూస్తే చైనా-భారత్ మధ్య యుద్ధ వాతావరణమే కనిపిస్తోందని సైనిక వర్గాలు అంటున్నాయి. కరోనాతో కుదేలైన ఇరు దేశాలు యుద్ధానికి వెళితే అపారనష్టం ఖాయం. కానీ ఎవరూ కాంప్రమైజ్ కాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తాజాగా చరిత్రలో మొదటిసారి భారత్-చైనా రెండు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు శనివారం సమావేశం కాబోతున్నారు. అన్ని విధాలుగా చైనాను డిఫెన్స్ లో వేసేలా భారత్ ఎత్తుగడలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

గడిచిన రెండు రోజులుగా భారత సరిహద్దుకు చైనీస్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు యుద్ధ సన్నహాలు చేశాయి. భారత్ కూడా కార్గిల్ యుద్ధంలో గెలుపునకు తోడ్పడ్డ బోఫోర్స్ శతఘల్ని చైనా సరిహద్దులో దింపింది. ఇప్పటికే భారత భూభాగంలోని 50 కిలోమీటర్లను చైనా ఆక్రమించినట్టు తాజా రిపోర్టులో వెల్లడి కావడంతో భారత్ కూడా ధీటుగా స్పందిస్తోంది.

1962 తర్వాత భారత్-చైనాల మధ్య మరోసారి యుద్ధవాతావరణం కనిపిస్తోంది. శనివారం మీటింగ్ లో భారత్ చైనా తన సేనల్ని ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేసి వెళ్లాలని డిమాండ్ చేయనుంది. ఇప్పటికే భారత్ తరుఫున లెఫ్ట్ నెంట్ జనరల్ వైకే జోషి లఢక్ చేరుకున్నారు. రెండు దేశాల మధ్య ఏం జరగనుందనేది ఆందోళన రేకెత్తిస్తోంది.