Begin typing your search above and press return to search.
భారత్‌లో పడిపోయిన ప్రజల జీవిత కాలం.. యూఎన్‌డీపీ షాకింగ్ నివేదిక!
By: Tupaki Desk | 9 Sep 2022 5:08 AM GMTఐక్యరాజ్య సమితి అభివృద్ది కార్యక్రమం (యూఎన్‌డీపీ) తాజా నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. భారత్‌లో సగటు ఆయుర్దాయం 69.7 సంవత్సరాల నుంచి 67.2 ఏళ్లకు పడిపోయిందని తాజా నివేదికలో బాంబుపేల్చింది. గత రెండేళ్లు కరోనా సృష్టించిన విలయం ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసిందని యూఎన్‌డీపీ అభిప్రాయపడింది. ఈ అంతర్జాతీయ పరిణామాల ఫలితాలు భారత్‌లోనూ ప్రతిబింబించాయని పేర్కొంది.
ఆరోగ్యం, విద్య, సగటు ఆదాయం అనే మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఐక్యరాజసమితి మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)-2021ని తాజాగా విడుదల చేసింది. మొత్తం 191 దేశాలతో ఈ జాబితా రూపొందగా ఇందులో భారత్ 132వ స్థానంలో నిలవడం గమనార్హం. 2020 మానవాభివృద్ధి సూచీలో 131 ర్యాంక్ పొందిన మన దేశం తాజా నివేదికలో మరో స్థానం దిగజారింది. కాగా 2020 హెచ్‌డీఐ జాబితాలో మొత్తం 189 దేశాలున్నాయి. 2021లో మన దేశ హెచ్‌డీఐ విలువ 0.633 కాగా అంతకు ఏడాది క్రితం (2020లో) ఇది 0.642గా ఉండడం గమనార్హం. హెచ్‌డీఐ విలువ దిగజారడంతో మన ర్యాంక్ కూడా పడిపోయింది.
ఇప్పటికీ పలు దేశాల్లో కోవిడ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కోవిడ్ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆయా దేశాలు లాక్‌డౌన్ విధిస్తూనే ఉన్నాయి. ఓవైపు ఆంక్షలు, మరోవైపు ఆరోగ్యంపై నెలకొన్న భయానక పరిస్థితులు ప్రజాజీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించింది. ఇలా గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారితో ప్రపంచ మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి వెళ్లినట్లు యూఎన్‌డీపీ తన తాజా నివేదికలో సంచలన విషయాలు పేర్కొంది.
కోవిడ్ విజృంభించడంతో గత రెండేళ్లు (2020, 2021) మానవాభివృద్ధి నిలిచిపోయిందని.. అంతేకాకుండా క్షీణించిపోయిందని యూఎన్‌డీపీ వివరించింది. ప్రధానంగా ఆయా దేశాల్లో ఆయుర్దాయం, విద్యా స్థాయిలు, జీవన ప్రమాణాలు గణనీయంగా పడిపోయాయని బాంబు పేల్చింది.
ప్రపంచ ఆయుర్దాయం 2019లో 73ఏళ్లుగా ఉండగా.. అది 2021నాటికి 71.4కు పడిపోయిందని తన తాజా నివేదికలో వెల్లడించింది. యూఎన్‌డీపీ ఏర్పడిన గత 30ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించింది. ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం దేశాలు ఈ గడ్డు పరిస్థితులను చవిచూస్తున్నాయని తెలిపింది.
ఈ సంక్షోభాలను కొన్ని దేశాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పటికీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, దక్షిణాసియా, కరేబియన్ ప్రాంతాల్లోని కొన్ని దేశాలు ఇంకా ఎదుర్కోలేకపోతున్నాయని యూఎన్‌డీపీ వెల్లడించింది. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆహార, ఇంధన సంక్షోభాలను మరింత ముదిరేలా చేసిందని తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.