Begin typing your search above and press return to search.

అమెరికాలో భారత్‌ టెక్కీకి జీవిత ఖైదు..ఏం చేశాడంటే ?

By:  Tupaki Desk   |   12 Nov 2021 5:30 PM GMT
అమెరికాలో భారత్‌ టెక్కీకి జీవిత ఖైదు..ఏం చేశాడంటే ?
X
భారత్‌ కు చెందిన టెక్కీ కి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. కుటుంబ సభ్యులను తానే చంపేసినట్టు ఒప్పుకోవడంతో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే .. శంకర్ నాగప్ప ఐటీ నిపుణిడిగా ఓ కంపెనీలో జాబ్ చేస్తూ తన కుటంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలో నివాసం ఉండేవాడు. అయితే 2019లో అతడి జాబ్ పోయింది. దీంతో ఒక్కసారిగా షాకైన శంకర్.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కుటంబ సభ్యులను పోషించలేనని భావించిన అతడు, వారిని హతమార్చేందుకు సిద్ధం అయ్యాడు. పక్కా ప్లాన్‌ తో వారం వ్యవధిలో భార్య, ముగ్గురు పిల్లను హత్య చేశాడు. ఈ క్రమంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు కూడా నమోదు చేశారు.

మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో శంకర్‌ నాగప్ప తన నేరాన్ని అంగీకరించడంతో తాజాగా అక్కడి న్యాయస్థానం అతడికి పెరోల్‌కు వీలులేని యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై అతడు ఎలాంటి వ్యాఖ్యాలు చేయలేదు. అయితే విచారణ సందర్భంగా తాను ఈ దారుణానికి పాల్పడలేదని శంకర్ వాదించాడు. కొద్ది రోజుల క్రితం వరకూ అదే వాదనను కొనసాగించిన ఆయన.. తాజాగా నిజం ఒప్పుకున్నాడు. దీంతో అమెరికా న్యాయస్థానం.. శంకర్‌కు జీవిత ఖైదు విధిస్తూ అమెరికా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా అతడికి పెరోల్‌పై బయటకు వచ్చే అవకాశం కూడా లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఘటన తమను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని స్థానికులు చెప్పారు.