Begin typing your search above and press return to search.
అన్న గారికి వెన్నుపోటు : 1988లోనే బీజం....ఏడేళ్ళు జాప్యం
By: Tupaki Desk | 14 Oct 2022 3:41 PM GMTఇది నిజమే అని కాలం రుజువు చేసింది. జనం ఎన్టీయార్ ని మెచ్చారు. మూడు సార్లు అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రిని చేశారు. కానీ నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబు ఇద్దరూ అన్న గారిని దించి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇందులో నాదెండ్ల బయట వారు కావడంతో నెల రోజుల సీఎం గా ఉండి దిగిపోవాల్సి వచ్చింది. చంద్రబాబు కుటుంబ సభ్యుల మద్దతు సాధించడంతో చిరకాలం సీఎం గా ఉన్నారు. పార్టీని మొత్తం తన గుప్పిటలో ఉంచుకున్నారు.
ఇదిలా ఉంటే భోళాగా ఉండే ఎన్టీయార్ కి సీఎం గా ఉన్నా కొందరు పెద్దలతో విభేదాలు వచ్చాయని చెబుతారు. 1988 ప్రాంతంలో ఒక ప్రముఖ మీడియా అధిపతితో ఎన్టీయార్ కి వివాదం మొదలైందని ఆ తరువాత వారిద్దరి మధ్య పెరిగిన ఎడం 1995 వెన్నుపోటు ఎపిసోడ్ లో అన్న గారు పదవీచ్యుతులు అయ్యేంతవరకూ సాగిందని చెబుతారు. దీని మీద ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకట్వేశ్వరరావు వెన్నుపోటు వెనక ఏమి జరిగింది అన్నవి చాలా విషయాలు రాసి గ్రంధస్థం చేసిన అనేక అంశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఇక 1989 మొదట్లో లో ఎన్టీయార్ తన క్యాబినేట్ నుంచి సడెన్ గా 30 మందికి పైగా సీనియర్లను తప్పించి మొత్తం నూరు శాతం మంత్రులను కొత్తవారిని తీసుకున్నారు. అది నాటికీ నేటికీ ఒక రాజకీయ సంచలనం. ఆ మీదట టీడీపీ సీనియర్లలోని అసమ్మతిని చూసి అప్పట్లోనే ఎన్టీయార్ మీద తిరుగుబాటుకు చేయించాలని ఆ మీడియాధిపతి తనకు టీడీపీలో తనకు దగ్గరగా ఉన్న వారితో ప్రయత్నాలు చేశారని, వాటిని తాను గమనించి జాగ్రత్తగా తిప్పికొట్టడం జరిగింది అని దగ్గుబాటి రాసిన వాటిలో కూడా ఉంది.
అలా టీడీపీ సీనియర్లలో మొదలైన అసహనం కూడా 1995లో వారు చంద్రబాబు వెంట నడవడానికి కారణం అయింది అని అంటారు. ఇక మొదట పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు టీడీపీలో పట్టు పెంచుకున్నారని చెబుతారు. ఇక 1989లో టీడీపీ ఓడిపోవడంతో ఎన్టీయార్ అసెంబ్లీకీ రావడం మానుకున్నారు. ఆ విధంగా అసెంబ్లీలో టీడీపీ ఉప నేతగా ఉన్న చంద్రబాబుకు కీలక బాధ్యతలు నిర్వహించే చాన్స్ వచ్చింది.
అది ఆయన తన నాయకత్వ లక్షణాలతో బాగానే ఉపయోగించుకున్నారు. అప్పట్లో అసెంబ్లీలో 73 మంది దాకా టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే అందరూ దాదాపుగా బాబుకు సన్నితులు అయిపోయారు. ఇది ఆయనకు 1995లో ఎన్టీయార్ తో విభేదాలు వచ్చినపుడు చాలా బాగా కలసివచ్చింది. ఇలా అనేక అంశాలతో పాటు లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తి అని చూపించి పార్టీలో చీలిక తీసుకు వచ్చారని నాటి పత్రికా కధనాలు చెబుతున్నాయి.
ఇదే కీలక సమయంలో ఎన్టీయార్ తో 1988లోనే విభేదాలు వచ్చినట్లుగా ప్రచారంలో ఉన్న ఒక మీడియా పెద్దాయన కూడా కావాల్సినంతగా సహకరించడంతో చాలా సులువుగా ఎన్టీయార్ వెన్నుపోటు కార్యక్రమం సాగింది అని అంటారు. అయితే ఆ తరువాత చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చిన దగ్గుబాటి కానీ హరిక్రిష్ణ కానీ తమను బాబు మోసం చేశారనే ఆరోపించారు.
ఇక ఎన్టీయార్ స్వయంగా అల్లుడు తనను గద్దె నుంచి దించేశాడని, తన కుటుంబాన్ని కూడా ఆఖరుకు తన నుంచి వేరు చేశారని ఆవేదన చెందుతూ చెప్పిన వీడియోలు ఈ రోజుకీ యూ ట్యూబ్ లో భద్రంగా ఉన్నాయి. మరి ఎన్టీయార్ కి దండం పెట్టి ఆయన మాట వినలేదని పార్టీని పరిరక్షించుకున్నామని చెబుతున్న దానికీ ఆనాడు జరిగిన దానికి ఎంతో తేడా ఉందని నాడు ప్రత్యక్షంగా చూసిన వారు కానీ అపుడు రాజకీయల మీద అవగాహనతో ఉండి అంతా పరిశీలించిన వారు కానీ నేడు చెప్పే మాట. బట్ వెన్నుపోటు వెనక ఇదీ అసలు సంగతి అని ఇపుడు చంద్రబాబు చెప్పాక అసలు విషయం ఏంటి అన్నది జనాల ఆలోచనలకే వదిలేయడం బెటరేమో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.