Begin typing your search above and press return to search.

రామోజీరావు.. ఆధునిక బ్రహ్మ

By:  Tupaki Desk   |   28 Sep 2016 10:01 AM GMT
రామోజీరావు.. ఆధునిక బ్రహ్మ
X
రామోజీ రావు అదో రకం. అందరూ ఆయన్ని అనుసరించాల్సిందే తప్ప.. ఆయన ఎవరినీ అనుసరించడు. ఆయన ప్రపంచమే వేరు. చీఫ్ మినిస్టర్లయినా వచ్చి ఆయన్ని కలవాల్సిందే తప్ప ఆయన ప్రత్యేకంగా వచ్చి ఎవరినైనా కలవడం అరుదు. కానీ గత కొన్నేళ్లలో ఆయన తీరు మారింది. కొంచెం బయటికి వస్తున్నారు. కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఎప్పుడూ వైట్ అండ్ వైట్ వేసుకునే రామోజీ.. ఈ మధ్య బ్లాక్ సూటేసుకుని ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం గుర్తుండే ఉంటుంది. ఇన్నేళ్లలో అవార్డుల మీద ఏమాత్రం ఆసక్తి చూపించని మీడియా మొఘల్.. ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికవడం.. స్వయంగా వెళ్లి అవార్డు తీసుకోవడమూ తెలిసిందే. రామోజీ కోరుకుని ఉంటే ఇలాంటి పురస్కారాలు ఎప్పుడో వచ్చేవి కానీ... ఆయన ఆసక్తి చూపించలేదు.

తాజాగా రామోజీ మరో పురస్కారం అందుకున్నాడు. రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ ముగింపు ఉత్సవాల సందర్భంగా రామోజీని జీవిత కాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. స్వయంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వచ్చి ఈ వేడుకల్లో పాల్గొని రామోజీని సత్కరించారు. రామోజీ ఆధునిక బ్రహ్మ అని.. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఫిలిం సిటీకి సృష్టికర్త.. ఇంజినీర్.. ఆర్కిటెక్ట్ ఆయన అని రామోజీని ప్రశంసల్లో ముంచెత్తాడు వెంకయ్య. ఈ ఫిల్మ్ కార్నివల్ పెద్ద పేరున్నదేమీ కాదు. ఐతే రామోజీ ఫిలిం సిటీ ప్రమోషన్ కోసమో ఏమో ఈ వేడుకను ఈసారి ఘనంగా అక్కడే నిర్వహించారు. పెద్ద పెద్ద వాళ్లను రప్పించి.. దీనికి ప్రాధాన్యం చేకూర్చారు. రామోజీ ఆరంభ.. ముగింపు వేడుకలకు హాజరవడం.. వాళ్లో అవార్డు ఇస్తే తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/