Begin typing your search above and press return to search.
వైట్ హౌస్ చరిత్రలో అత్యంత అరుదైన సంఘటన ..ఏంటంటే ?
By: Tupaki Desk | 2 Jun 2020 2:00 PM GMTఅమెరికాలో వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకముందే ..మరో సమస్య అమెరికాను అతలాకుతలం చేస్తుంది. అమెరికాలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆ దేశాధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ చీకట్లు కమ్ముకున్నాయి. గాఢాంధకారంలోకి వెళ్లింది. వైట్ హౌస్ లోని విద్యుత్ దీపాలను ఉద్దేశపూరకంగా ఆర్పివేశారు. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతానికి నిరసనగా ఆ దేశవ్యాప్తంగా ఆందోళనకారులు విధ్వంసం చేస్తున్న సమయంలో శ్వేతసౌధంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసగా విధ్వంసానికి దిగిన ఆఫ్రికన్ అమెరికన్లు రాజధాని వాషింగ్టన్ డీసీని సైతం వదిల పెట్టలేదు. వాషింగ్టన్‌లో గల అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం ఎదుట నిరసన ప్రదర్శనలను చేపట్టారు. బాటిళ్లు, ప్లకార్డులు సహా అందుబాటులో ఉన్న వస్తువులను వైట్‌హౌస్ మీదికి విసిరేశారు. వారిని అడ్డుకోవడానికి భద్రత బలగాలు శాయశక్తులా కృషి చేసినప్పటికీ ఫలితం రాలేదు.
అమెరికాలో పరిస్థితులు అదుపు తప్పినట్టు గుర్తించిన వైట్ హౌస్ సిబ్బంది డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబాన్ని అండర్ గ్రౌండ్ బంకర్ లోకి తరలించారు. ఆ సమయంలోనే లైట్లను ఆర్పివేశారు. వైట్ హౌస్ చరిత్రలో అత్యంత అరుదైన సందర్భంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైట్‌హౌస్ సిబ్బంది లైట్లను ఆర్పివేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు.
దీనిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. వైట్ హౌస్ లైట్లను ఆర్పివేయడం అంటే, అధ్యక్షుడు లేరు అనే సంకేతాన్ని ఇచ్చినట్టవుతుందని అంటున్నారు. లైట్లు ఆర్పి ఉంచినంత సేపు ఆ దేశాధ్యక్ష పదవి ఖాళీగా ఉందనే సందేశాన్ని కూడా దీనిద్వారా ఇస్తారని, చరిత్రలో అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే ఆ పరిస్థితులు తలెత్తాయని అంటున్నారు. వైట్‌హౌస్‌లోని భద్రతాధికారులు చీకట్లోనూ చూడటానికి వీలు ఉన్న నైట్ విజన్ పరికరాలను వినియోగించాల్సి ఉన్నందున లైట్లను ఆర్పివేశారనే వాదన కూడా వినిపిస్తోంది. ఆందోళనకారులను స్పష్టంగా గుర్తించడానికి లైట్లను ఆర్పివేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఏదేమైనా వైట్ హౌస్ చరిత్రలో అత్యంత అరుదైన సంఘటన ఇదే అంటూ ఇప్పుడు దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది.