Begin typing your search above and press return to search.
చైనా దగ్గర అన్ని వ్యాక్సిన్లా? బాంబు పేల్చిన ఆ దేశ శాస్త్రవేత్త
By: Tupaki Desk | 5 July 2021 8:48 AM GMTకరోనాను పుట్టించిన దేశం చైనా.. వాళ్ల చెడు అలవాట్లో లేక.. బయో వార్ కోసం తయారు చేసిందో తెలియదు కానీ.. ఆ కరోనా వైరస్ మాత్రం ప్రపంచానికి పాకి లక్షలమందిని చంపేసింది. కోట్ల మందిని బాధితులుగా చేసింది. అయితే చైనా మాత్రం ఈ మహమ్మారిని అరికట్టి అక్కడ కేసులు లేకుండా చేసుకొని మాస్కు లేకుండా ఆ దేశ ప్రజలు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది.
కరోనా వైరస్ ను అరికట్టడానికి చైనా చాలా ప్రయత్నాలే చేసిందన్న వాస్తవాన్ని ఆ దేశ శాస్త్రవేత్త బయటపెట్టాడు. అదిప్పుడు వైరల్ గా మారింది. కరోనా వైరస్ ఏ మ్యూటెంట్ వచ్చినా కూడా చైనా ప్రజలను ఏం చేయకుండా ఆ దేశం మొత్తం 71 వ్యాక్సిన్లను పరిశీలించి అభివృద్ధి చేస్తోందని.. ఆ వ్యాక్సిన్లు డెల్టా మ్యూటేటెడ్ వైరస్ పై కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని చైనా దేశానికి చెందిన టాప్ ఎపిడెమియాలజిస్ట్ జోంగ్ నాన్షాన్ సంచలన విషయాలు బయటపెట్టాడు.
షాంఘై టెక్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో నాన్షాన్ ప్రసంగించారు. కోవిడ్ 19 వైరస్ కు వ్యతిరేకంగా చైనా దేశం వ్యాక్సిన్లపై చేస్తున్న పరిశోధనలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. 71 వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతుండగానే.. ఇప్పటికే 9 టీకాలు వాడుకలోకి వచ్చాయని ఆయన ప్రభుత్వ వ్యవహారాలను బయటపెట్టారు.
ఇప్పటికే చైనా తయారు చేసిన రెండు టీకాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చైనాకు చెందిన సినోవాక్, సినో ఫార్మ్ లు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పంచారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న డెల్టా వైరస్ ను సైతం ఈ వ్యాక్సిన్లు ఎదుర్కొంటాయని తెలిపారు.
ప్రస్తుతం 71 టీకాలు పరిశోధన దశలో ఉన్నాయని.. వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నాన్షాన్ తెలిపారు. వీటిని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు వైద్యాధికారులు ముమ్మర ప్రయత్నాలు చేశారని తెలిపారు.
కరోనా వైరస్ ను నియంత్రించడంలో విఫలమైతే కేవలం 20 రోజుల్లోనే 7.3 మిలియన్ల మంది ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని అంచనావేశారు. అయితే వైరస్ బారిన పడి వ్యక్తులను గుర్తించి గాంగ్జౌ పట్టణంలో విజయవంతంగా కరోనాను కట్టడి చేశామని ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పూర్తిగా కంట్రోల్ లోకి వస్తేనే అది తగ్గుతుందని.. ఒక దేశంలో తగ్గిపోయి మరో దేశంలో ఎక్కువగా ఉంటే దాన్ని ఆపడం ఎవరి తరం కాదని చైనా శాస్త్రవేత్త తెలిపారు.దీన్ని బట్టి ప్రపంచం ఇంకా ప్రమాదంలో ఉందనే అర్థం అన్నారు.
-71 చైనా వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ తో ముప్పు
చైనాలో ఈ 71 కరోనా టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఇవన్నీంటిని కూడా ప్రజలకు ఇస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై అంతర్జాతీయ పత్రిక ఒకటి ఇటీవలే సంచలన కథనాన్ని ప్రచురించింది. దీనివల్ల ప్రజలకు దుష్ప్రభావాలు కలుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నా ఆపడం లేదని పేర్కొంది.
చైనాలో పలు సంస్థలు ఈ 71 కరోనాకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. అవన్నీ ప్రయోగ దశలోనే ఉన్నాయి. సాధారణ వినియోగానికి అనుమతి రాలేదు. అయితే కరోనాతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ‘అత్యవసర అనుమతి’కింద ఆ వ్యాక్సిన్లను ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం జూన్ లో అనుమతిచ్చింది. దీన్ని బేస్ చేసుకొని అక్కడి కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలు మాత్రం లక్షలమందికి ఈ టీకాలు ఇచ్చేస్తున్నాయి.
చైనాలో ప్రఖ్యాత రచయిత కాన్ చాయ్ ఇటీవల వెబినార్ లో ఈ ప్రయోగాత్మక టీకాలు జనాలు ఇస్తున్నారని బాంబు పేల్చారు. మానవ ప్రయోగాలు కాకముందే చైనా కంపెనీలు జనాలకు ఇస్తూ వారి ప్రాణాలతో ఆటలాడుతున్నాయని ఆయన ఆరోపించారు. అయితే ఈ చర్యలను చైనా అధికారులు సమర్థించుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు.