Begin typing your search above and press return to search.
దేవుడు..సెక్స్..భయాలేనన్న మేధావి రచయిత్రి
By: Tupaki Desk | 7 Oct 2017 10:17 AM GMTపేరుకు సెలబ్రిటీలే కానీ.. నిత్యం వివాదాలతో సహజీవనం చేసే వారు కొందరుంటారు. అలాంటి కోవకే చెందుతారు సెలబ్రిటీ రచయిత్రి శోభాడే. ఏ విషయం మీద మాట్లాడితే.. తన మాటలు మీడియాలో పెద్ద పెద్దగా అచ్చేస్తాయో ఆమెకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. లెక్క చూసుకొని మరీ.. వివాదాస్పద సబ్జెక్ట్ లను ఎంచుకొని మరీ మాట్లాడే శోభాడే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుశ్వంత్ సింగ్ సాహిత్య వేడుకల్లో పాల్గొన్న శోభాడే.. దేవుడు.. శృంగారం గురించి మాట్లాడుతూ.. కామసూత్ర.. ఇండియాలో శృంగార పద్దతులు.. సెక్స్ మీద ఇప్పుడున్న వారి అభిప్రాయాలపై మాట్లాడారు. కామ అన్నది అందమైన పదమని..కానీ కామసూత్ర అలా కాదన్నారు. శృంగారాన్ని భారతీయులు ఎంజాయ్ చేస్తారని ప్రపంచం మొత్తం అనుకుంటుందని.. కానీ దేశంలో మాత్రం దాన్ని వేరేగా ఉపయోగించుకుంటున్నారన్నారు.
దేవుడిలానే శృంగారం కూడా జనాల్ని భయపెడుతోందన్నారు. గాడ్.. సెక్స్ రెండు మూడు పదాలే (ఇంగ్లిషులో) అన్న ఆమె.. ఈ రెండింటినీ హింసాత్మక లక్ష్యాల కోసమే వాడేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. కొందరు తాము అనుకున్న దానికి చేరుకోవటానికి ఈ రెండింటిని వాడేస్తున్నారంటూ మండిపడ్డారు.
శోభాడే మాటల సంగతి ఇలా ఉంటే.. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి దివ్యా దత్తా సైతం సినిమాల్లో సెక్స్ ముచ్చటను బహుచక్కగా చెప్పుకొచ్చారు. ఒకప్పుడు హీరోయిన్ ను పద్ధతిగా చూపించేవారని.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్నారు. ఎక్స్ పోజింగ్ కోసం వ్యాంప్ తరహాలో పాత్రల్ని సృష్టించేవారని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని.. హీరోయిన్లే శృంగార సీన్లలో తెగ రెచ్చిపోతున్నారన్నారు. ఇలాంటి వాటిని చూసేందుకుజనాలు కూడా మొహమాటపడటం లేదంటూ వ్యాఖ్యానించారు. వీరిద్దరి మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.