Begin typing your search above and press return to search.

2020 ఐపీఎల్ కు లైన్ క్లియర్!

By:  Tupaki Desk   |   1 July 2020 5:45 AM GMT
2020 ఐపీఎల్ కు లైన్ క్లియర్!
X
క్రికెట్ అంటే భారత్ లో ఒక మతం.. క్రికెట్ అంటే దేశం లోని జనాలకు ప్రాణం.. క్రికెట్ లేని భారత్ ను అస్సలు ఊహించలేం. ఐపీఎల్ అయినా.. ఇండియన్ క్రికెట్ అయినా పిచ్చి గా చూస్తారు..

కరోనా భయం తో దేశ ప్రజలంతా భయంతో బిగుసు కు పోయారు. చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. దేశ ప్రజల మానసిక స్థితి గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఎంజాయ్ చేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది కరోనా కారణంగా వాయిదా పడింది. తొందరగా అన్ని కార్యకలాపాలు, ఆటలు మళ్లీ ప్రారంభం కావాలని కోరుకుంటున్నారు. అప్పుడే ప్రజలకు కాస్త రిలీఫ్ దొరుకుతుందని.. మనసు సరైన దారిలో ఉంటుంది.

ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, దేశవ్యాప్తంగా స్టేడియాలు.. అభిమానులు ఉన్నా కరోనా కారణం గా ఐపీఎల్ వాయిదా వేయాల్సిన పరిస్థితి.. ఇన్ని వసతులు.. కోట్ల కొద్దీ డబ్బు.. మందీ మార్బలం ఉన్న భారత్ లో అది నిర్వహించక పోతే భారీ నష్టం తప్పదు.

నిజానికి ఈ శీతాకాలంలో టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ పొట్టి ప్రపంచకప్ ను నిర్వహించమని ఆస్ట్రేలియా ప్రకటించింది. దీంతో ఈ గ్యాప్ లో అన్ని దేశాలు ఖాళీగా ఉంటాయి. ఆటగాళ్లు అంతా సిద్ధంగా ఉంటారు. ఈ అద్భుత టైంలోనే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.

దాదాపు 4వేల కోట్ల రూపాయలతో నడిచే ఐపీఎల్ వాయిదా పడితే బీసీసీఐకి , ఫ్రాంచైజీలకు ఎంతో నష్టం. అందుకే ఈ లీగ్ ను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని చర్యలు మొదలుపెట్టింది. వరల్డ్ కప్ ను ఐసీసీ వాయిదా వేయగానే ఆ ఖాళీ టైంలో నిర్వహించాలని చూస్తోంది. మిగతా బోర్డుల నుంచి కూడా ఐపీఎల్ కు ఈ టైంలో అడ్డంకులు ఎదురుకావు. అందుకే ఇప్పుడు ఐసీసీ నిర్ణయం వెలువడగానే బీసీసీఐ ఐపీఎల్ కు రంగం సిద్ధం చేయనుంది.