Begin typing your search above and press return to search.
ఇద్దరు అధినేతలు ముద్దుల పారిశ్రామిక వేత్త?
By: Tupaki Desk | 13 Oct 2018 11:13 AM GMTరాజకీయాల్లోకి వ్యాపారవేత్తలు రావడం....లేదంటే రాజకీయ నాయకులకు అత్యంత సన్నిహితులుగా మెలుగుతూ తమ పనులు చక్కబెట్టుకోవడం సర్వసాధారణం. ఆ క్రమంలోనే ఏదో ఒక పార్టీ అండ తీసుకోవడం....ఆ పార్టీకి అండగా ఉండడం కామన్. కానీ, ఏపీలోని ఓ పారిశ్రామిక వేత్త మాత్రం ఏపీలో రెండు ప్రధాన పార్టీల అధినేతకు సన్నిహితంగా ఉంటూ....`అజ్ఞాత`మధ్యవర్తిగా ఉంటున్నాడని తెలుస్తోంది.
లింగమనేని ఎస్టేట్స్ అధినేత లింగమనేని రమేశ్..ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్ కు మ్యూచువల్ ఫ్రెండ్ గా ఉంటూ పనులు చక్కబెడుతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.లింగమనేని ఎస్టేట్స్ కోసం టీడీపీ సర్కార్ పలు త్యాగాలు చేసిందని టాక్ ఉంది. లింగమనేని వ్యాపారాలకు చంద్రబాబు గట్టి సహకారమే అందిస్తున్నారని నాలుగేళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, జనసేన అధినేత పవన్ అమరావతి ప్రాంతంలో భూమి కొనుగోలు, ఇంటి నిర్మాణంలో కూడా లింగమనేని హ్యాండ్ ఉందట. అమరావతి ప్రాంతంలో ఓ దేవాలయ ఆరంభోత్సవంలో చంద్రబాబు,పవన్ ల మధ్య `వర్తి`రమేష్ అట. ఈ ఇద్దరి భేటీకి కూడా లింగమనేని కారణమని టాక్ ఉంది. ఇక, నాదెండ్ల మనోహర్-పవన్ ల భేటీలో కూడా లింగమనేని కీలకమైన పాత్ర పోషించారట. జనసేనలోకి నాదెండ్ల చేరబోవడం వెనుక కూడా లింగమనేని హ్యాండ్ ఉందట. ఈ నేపథ్యంలో తిరుపతి టూర్ లో పవన్ పక్కన లింగమనేని ఉన్నారని టాక్. టీడీపీపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ లతో ఏకకాలంలో లింగమనేని ఫ్రెండ్ షిప్ ఎలా కొనసాగిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి, ఈ రాజకీయ `త్రి`బంధం ఏ వైపునకు దారితీస్తుందో వేచి చూడాలి.