Begin typing your search above and press return to search.
లింక్డ్‌ఇన్ సీఈఓ రాజీనామా.. త్వరలోనే కొత్త బాస్
By: Tupaki Desk | 6 Feb 2020 9:34 AM GMTప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సొంతమైన లింక్డ్‌ఇన్ సీఈఓగా కొనసాగుతున్న జెఫ్ వీనర్ (49) గురువారం తన పదవికి రాజీనామా చేశారు. 11 ఏళ్ల పాటు సంస్థ కు సీఈఓగా సేవలు అందించిన జెఫ్ వీనర్ ఇక ఆ బాధ్యతలు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేస్తూ సంస్థతో ముడిపడిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పదకొండేళ్లు గా తన జీవితంలో వృత్తి పరంగా ఎన్నో అనుభూతులు వచ్చాయని తెలిపారు. దీనికి సహకరించిన లింక్డ్‌ఇన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
2008లో లింక్డ్‌ఇన్ సీఈఓగా జెఫ్ వీనర్ బాధ్యతలు స్వీకరించాడు. ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ తొలిసారి 2011లో పబ్లిక్ ఆఫరింగ్ (స్టాక్)కు వచ్చింది. మైక్రోసాఫ్ట్ 2016లో దీనిని కొనుగోలు చేసింది. లింక్డ్ఇన్ ఆదాయం 12 నెలల్లో 78 బిలియన్ డాలర్ల నుంచి 7.5 బిలియన్ డాలర్ల కు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. తన కాలంలో సంస్థ ఎదుగుదలతో ఎంతో పాటుపడ్డారు. ఇక ఆయన వైదొలగడంతో ఆయన స్థానంలో లింక్డ్‌ఇన్ లో పదేళ్లకు పైగా కొనసాగుతున్న ప్రొడక్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ర్యాన్ రోస్లాన్స్కీ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ర్యాన్ త్వరలోనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ‍్లకు రిపోర్ట్ చేస్తారని సంస్థ వెల్లడించింది. ఈ సందర్భం గా కాబోయే సీఈఓ ర్యాన్ కు జెఫ్ వీనర్ శుభాకాంక్షలు తెలిపారు.