Begin typing your search above and press return to search.

లింక్డ్ ఇన్‌ కు వైర‌స్ దెబ్బ‌.. ఏకంగా 960 మంది ఉద్యోగుల తొల‌గింపు

By:  Tupaki Desk   |   22 July 2020 11:50 AM GMT
లింక్డ్ ఇన్‌ కు వైర‌స్ దెబ్బ‌.. ఏకంగా 960 మంది ఉద్యోగుల తొల‌గింపు
X
మ‌హ‌మ్మారి వైర‌స్ వ్యాప్తి అన్ని రంగాల‌పై తీవ్రంగా ప్ర‌భావం చూపుతోంది. ముఖ్యంగా ఉద్యోగుల‌కు గ‌డ్డు కాలం ఏర్ప‌డింది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోమోన‌ని ఉద్యోగులు భ‌యంభ‌యంగా విధులు నిర్వ‌హిస్తున్నారు. న‌ష్టాలు రావ‌డం.. మార్కెట్ మంద‌గ‌మ‌నంలో ఉండ‌డం.. కొనుగోలు శ‌క్తి పెర‌గక‌పోవ‌డం వంటి వాటితో అన్ని రంగాలు న‌ష్టాల బారిన ప‌డ్డాయి. దీంతో ఉద్యోగులను సాగ‌నంపేందుకు కంపెనీ యాజ‌మాన్యాలు నిర్ణ‌యం తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఈ ప‌రిస్థితి అధికంగా ఉంది. తాజాగా దీని ప్ర‌భావం లింక్డ్ ఇన్ కంపెనీపై ప‌డింది.

ఈ నేప‌థ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని ప్రముఖ ప్రొఫెషనల్‌ సోషల్‌ నెట్ వర్కింగ్ సంస్థ లింక్డ్ ‌ఇన్‌ నిర్ణయించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 960 మంది ఉద్యోగులకు ఆ కంపెనీ లేఆఫ్‌ను ప్రకటించింది. ఆ ఉద్యోగుల‌పై వేటు ప‌డ‌నుంది. అయితే మ‌ళ్లీ కంపెనీలో మరింత సిబ్బందిని తొలగించే ఉద్దేశం లేదని మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని లింక్డ్‌ఇన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ర్యాన్‌ రాస్‌ల్యాన్‌స్కై స్ప‌ష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ల మంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సాయం చేస్తామని కంపెనీ నిర్ణయించింది.