Begin typing your search above and press return to search.

సముద్రంలో కూలిన విమానం..200మందికి పైగా మృతి..

By:  Tupaki Desk   |   29 Oct 2018 6:00 AM GMT
సముద్రంలో కూలిన విమానం..200మందికి పైగా మృతి..
X
ఇండోనేషియా లో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది.. రాజధాని జకార్తా నుంచి బయలు దేరిన విమానం సముద్రంలో కూలిపోయింది. సముద్ర తీరానికి కొద్ది దూరంలోనే ఈ విమానం కూలిపోవడం గమనార్హం. ఈ ఉదయం 6.20 గంటలకు జకార్తా విమానాశ్రయం నుంచి 200 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఐదుగురు సిబ్బందితో లయన్ ఎయిర్ విమానం సుమత్ర దీవుల్లోని పంగ్కల్ షినాంగ్ నుంచి టేకాఫ్ అయ్యింది. అయిన 13 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో విమానం సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం గాలించిన అధికారులు అది జువా సముద్రంలో కుప్పకూలిపోయినట్లు నిర్ధారించారు.

ఇండోనేషియా రాజధాని జకార్త నుంచి ఈ విమానం బాంకా బెలిటంగ్ దీవుల్లోని ప్రధాన నగరమైన పంకకల్ షినాంగ్ కు బయలు దేరింది. సుమారు 200మందికి పైగానే ప్రయాణికులు ఉండవచ్చని అంచనావేస్తున్నారు. సముద్రం మీద నుంచి వెళుతుండగా కూలిపోయిందని.. శకలాలు తమకు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడ నేవి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. విమాన కూలిన ప్రదేశాన్ని కనుగొని అక్కడ క్రాష్ అయినట్టు రెస్క్యూ టీం ప్రతీనిధి యూసఫ్ లతీఫ్ ధ్రువీకరించారు.

2013లో కూడా ఇదే లయన్ కు చెందిన విమానం బాలీ సముద్రంలో కూలినా ఆ ప్రమాదంలో సిబ్బంది.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 2014లో కూడా ఇదే సంస్థ విమాన ప్రమాదంలో 25మంది చనిపోయారు. తాజా ప్రమాదంలో ఎవరైనా బతికున్నారా అన్న దానిపై ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. విమానం కుప్పకూలిన ప్రాంతంలో శకలాల గుర్తింపును నేవి అధికారులు ట్విట్టర్ లో షేర్ చేశారు.