Begin typing your search above and press return to search.
వాడిన టిష్యూ ధర 7.5 కోట్లు.. దాని స్పెషాలిటీ ఏంటంటే?
By: Tupaki Desk | 18 Aug 2021 12:30 PM GMTసాధారణ మనుషులతో పోలిస్తే సెలబ్రిటీలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారు ఏ పని చేసినా
జనాలు ప్రత్యేకంగా చూస్తుంటారు. వారి బయటకు వచ్చినా, బయట నుంచి లోనికి వెళ్లినా వార్తగా ఉండే పరిస్థితులు నేడు ఉన్నాయి. ఇక సెలబ్రిటీలు వాడిన వస్తువులను తీసుకునేందుకు ఫ్యాన్స్, జనాలు ఎగబడుతుంటారు. వేలం పాట వేస్తే ఇక అంతే.. భారీ ధర పలికే చాన్సెస్ ఉంటాయి. తాజాగా అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ఈ జాబితాలో చేరిపోయాడు.
ఇటీవల కాంట్రాక్ట్ పొడిగింపులో వచ్చిన ఇబ్బందుల వల్ల సదరు ఫుట్ బాలర్ స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాకు గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో తన అనుభవాలను ఫ్యాన్స్, ప్రజలతో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే కన్నీరు గార్చాడు మెస్సీ. ఆ తర్వాత ఓ టిష్యూ పేపర్‌తో ఉబికి వస్తున్న కన్నీళ్లతో పాటు ముక్కును తుడుచుకున్నాడు. అంతే ఇక ఆ టిష్యూ పేపర్ కూడా ఖరీదైన వస్తువులా మారిపోయింది.
సాధారణంగా అయితే, టిష్యూ పేపర్‌కు చాలా వాల్యూ ఉండబోదు. కానీ, ఈ టిష్యు పేపర్‌కు బోలెడు వాల్యూ వచ్చేసింది. సెలబ్రిటీ మెస్సీ వాడినందు వల్ల దానికి ఫుల్ వాల్యూ వచ్చింది. అతడు వాడిన టిష్యూ పేపర్‌ను ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ‘ఎమ్‌ఈకెడో’లో వేలం వేశారు. ఈ క్రమంలోనే టిష్యూ పేపర్‌కు సదరు వ్యక్తి రూ.ఏడున్నర కోట్లు ( 1 మిలియన్ డాలర్లు) ధర ఫిక్స్ చేశాడు. అది చూసి జనాలు నోరెళ్లబెట్టారు. ఓన్లీ టిష్యూ పేపర్‌కు ఇంత ధరేంటి? అని తమలో తాము చర్చించుకున్నారు. ఫుట్ బాలర్‌గా మెస్సీ ప్రయాణం బార్సిలోనాతో షురూ అయింది.
పదిహేడు సీజన్ల పాటు బార్సిలోనాతోనే రెండు దశాబ్దాలు ఉండిపోయాడు మెస్సీ. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు మెస్సీ. బార్సిలోనా క్లబ్‌ను వీడిన మెస్సీ ఇప్పుడు పారిస్ సెయింట్ జర్మన్ ఫుట్‌బాల్ క్లబ్‌కుఆడనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ రెండేళ్ల ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతులు ఇలా ఉంచితే.. మెస్సీ వాడిన టిష్యూ పేపర్ ధర గురించి నెట్టింట నెటిజన్ల చర్చ ఇంకా నడుస్తున్నది.
సెలబ్రిటీ అయినంత మాత్రాన టిష్యూ పేపర్ వాడితే అది విలువైన వస్తువుగా మారిపోతుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, పురాతన వస్తువు ఏదన్న అయితే వేలం పాటలో మంచి ధర లభించొచ్చు కానీ, ఈ క్లాత్‌కు ఏం ధర లభిస్తుందని మరి కొందరు సమాధానాలిస్తున్నారు. గతంలో పురాతన వస్తువులకు వేలం పాటలో రికార్డు స్థాయిలో ధర లభించింది. ఈ క్రమంలోనే సెలబ్రిటీల పట్ల ఇష్టం ఉంటే ఓకే. కానీ, అదే పనిగా వారి కోసమే పరితపించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని, వ్యక్తిగత జీవితంలోనూ అభిమనులు మందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.