Begin typing your search above and press return to search.
మెడికల్ కాలేజీలో వైద్యుల గానాబజానా!
By: Tupaki Desk | 26 Dec 2017 5:29 PM GMTవారంతా బాధ్యత గల వైద్య వృత్తిలో ఉన్నారు.....వారిని రోగులు డెమీ గాడ్ లుగా కొలుస్తుంటారు....అయితే, ఓ కార్యక్రమం సందర్భంగా వారిలోని నవ యువకులు బయటకు వచ్చారు....వారంతా కుర్రకారుగా మారిపోయి మందేసి చిందులు వేశారు.....అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలు కాపాడే అంబులెన్స్ ను మద్యం బాటిళ్ల రవాణాకు వినియోగించారు.....ఇవన్నీ చాలవన్నట్లు విదేశీ భామలతో అర్ధ నగ్న నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు.....దీంతో, ఈ సోకాల్డ్ వైద్యుల గానా బజానా వీడియో పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ లోని మీరట్‌లో ఉన్న లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం రసాభాసగా మారింది. తాము చదువుకొని 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు ...ఆ సమ్మేళనాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకున్నారు. దీంతో, అంబులెన్స్ లో మద్యం బాటిళ్లను వైద్య కళాశాల ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. వీరికి జోష్ ఇచ్చేందుకుగానూ రష్యన్ బెల్లీ డ్యాన్సర్లను తీసుకొచ్చారు. ఆ బెల్లీ డ్యాన్సులకు ఈ `యువ`వైద్య విద్యార్థులు కూడా ఒళ్లు మరచి స్టెప్పులు వేశారు. ఈ తతంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వైద్యులపై, కాలేజీపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబులెన్స్ లో మద్యం తరలించడంపై పలువురు మండిపడుతున్నారు. బాధ్యత గల వైద్యులు ఈ విధంగా ప్రవర్తించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో ఆ మెడికల్ కాలేజ్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వినయ్ అగర్వాల్ స్పందించారు. ఆ వివాదం వ్యవహారం తన వద్దకు వచ్చిందని, నిర్వాహకుల నుంచి వివరణ కోరానని చెప్పారు. మద్యం తెచ్చిన అంబులెన్సు మెడికల్ కాలేజీదా, లేక బయటిదా? అన్న సంగతి తేలాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫైర్ అయింది. వైద్యులు ఈ విధంగా ఒళ్లు మరచి ప్రవర్తించడం సరికాదని చెప్పింది. ఈ పార్టీలో పాల్గొన్న వైద్యులపై యూపీ సర్కార్ కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయిందని తెలుస్తోంది. ఇటువంటి కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోమని, బాధ్యులపై తప్పక కఠిన చర్యలు తీసుకుంటామని మీరట్ సీఎంఓ రాజక్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.