Begin typing your search above and press return to search.
ఏపీ బార్డర్లో మద్యం యాపారం ఫుల్ రైజ్
By: Tupaki Desk | 4 Sep 2020 1:30 AM GMTఇటు పక్క చూస్తే కోరుకున్న మద్యం బ్రాండ్ దొరుకుతుంది. రేటు కూడా తక్కువ. అటు వైపు చూస్తే ఇప్పటిదాకా కనీ వినీ ఎరుగని కొత్త కొత్త బ్రాండ్లు. వాటి క్వాలిటీ మీద అనేక అనుమానాలు. పైగా రేట్లు చూస్తే భారీగా ఉన్నాయి. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో మద్యం వైవిధ్యం. ఏపీలో పేరున్న బ్రాండ్లన్నింటినీ తీసి పడేసి ఏవేవో పేర్లతో లోకల్ బ్రాండ్లను విపరీతమైన ధరలతో అమ్ముతుండటం పట్ల ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ మార్గాల్లో పెద్ద ఎత్తున ఏపీలోకి ప్రవహిస్తోంది. ఈ రవాణాను కట్టడి చేసే ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. వేరే రాష్ట్రం నుంచి ఒక్కో వ్యక్తి మూడు ఫుల్ బాటిళ్లకు మించకుండా తెచ్చుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు ఇదో లాభసాటి వ్యాపారంగా మారుతోంది కొందరికి.
హైకోర్టు తీర్పు బయటికి వచ్చినప్పటి నుంచి కర్నూలు, కృష్ణా, చిత్తూరు జిల్లాల బార్డర్లలో అటు నుంచి మద్యం బాటిళ్లు పెద్ద ఎత్తున ఇటు వస్తున్నట్లు సమాచారం. తెలంగాణ, కర్ణాటక, చెన్నై రాష్ట్రాల నుంచి అక్కడి ఎమ్మార్పీ ధరలకు కొని రేటు పెంచి అమ్మినా.. ఇక్కడి లోకల్ బ్రాండ్లతో పోలిస్తే తక్కువే పడుతుండటం గమనార్హం. ఇక్కడి రేట్లకే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే మంచి బ్రాండ్లు దొరుకుతుండటంతో వీటికి మంచి డిమాండ్ ఉంటోంది. ఏపీలోని లోకల్ బ్రాండ్లంటే భయపడుతున్న మందు బాబులు.. అక్కడి మద్యం దుకాణాలకు వెళ్లడమే మానేసి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే బ్రాండ్ల కోసమే ఎదురు చూస్తున్నారు. హైకోర్టు ఇలా అనుమతి ఇవ్వడానికంటే ముందే బార్డర్లలోని పల్లెల ద్వారా అక్రమ మద్యం పెద్ద ఎత్తునే తరలుతోంది. చాలామంది కుర్రాళ్లు దీన్ని ఉపాధిగా మార్చుకుని నెల నెలా భారీగానే సంపాదిస్తున్నాడు. కర్నూలు జిల్లాలో వేలమంది కుర్రాళ్లకు ఇది మంచి వ్యాపారంగా మారిందట. ఇప్పుడు అధికారికంగానే మద్యం తరలించుకునే అవకాశం రావడంతో ఈ వ్యాపారం మరింత లాభసాటిగా మారింది.