Begin typing your search above and press return to search.

ఏపీలో మద్యం నిషేధం.. ఆయ‌న మాట నిజ‌మ‌య్యేనా..?

By:  Tupaki Desk   |   28 Dec 2022 2:30 AM GMT
ఏపీలో మద్యం నిషేధం.. ఆయ‌న మాట నిజ‌మ‌య్యేనా..?
X
ఏపీలో మద్యం నిషేధం అనే మాట వైసీపీ నేత‌ల నుంచి విన‌డం.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. జ‌రుగుతుంద‌ని ఆశ‌లు కూడా లేవు. ఎందుకంటే.. మద్యంాన్ని ఆదాయ వ‌న‌రుగా మార్చుకోవ డంలో.. వైసీపీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. బార్ల సంఖ్య‌ను త‌గ్గిస్తామ‌ని.. మద్యంన్ని పేద‌ల‌కు అందుబాటులో లేకుండా చేస్తామ‌ని.. ద‌శ‌ల వారీగా మద్యం న్ని నిషేధిస్తామ‌ని కూడా సీఎం జ‌గ‌న్ చెప్పారు.

అయితే.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం మానేశారు. పైగా.. వైన్ షాపుల‌ను ప్ర‌భుత్వ‌మే నియంత్రిస్తోంది. న‌డిపిస్తోంది. మ‌రోవైపు.. బార్‌లు య‌థాత‌థంగా న‌డుస్తున్నాయి.

వీటికితోడు వైన్ మాల్స్ కూడా వ‌చ్చేశాయి. అంటే.. దాదాపు మద్యం నిషేధానికి ఏపీ ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌నే విధానం స్ప‌ష్టంగా తెలుస్తోంది. దీనికి కార‌ణం కూడా ఉంద‌ని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

దేశంలో ఏ ప్ర‌భుత్వం కూడా ఇవ్వ‌ని విధంగా తాము సంక్షేమాన్ని ఇస్తున్నామ‌ని.. దీనికి డ‌బ్బులు ఎక్క‌డ నుంచి తీసుకురావాల‌ని కూడా వారు ప్ర‌శ్నిస్తున్నారు ఈ నేప‌థ్యంలో మద్యం‌నిషేధాన్నిదాదాపు ఎత్తేశార‌నే చెప్పాలి. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు మద్యంాన్ని నిషేధం చేయ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

అయితే.. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇది సాధ్య‌మ‌య్యేది కాద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఎందుకంటే.. వ‌చ్చే పాతిక సంవ‌త్స‌రాల‌కు సంబంధించిన మద్యంం అమ్మ‌కాల ఆదాయాన్ని చూపించి 4 వేల కోట్ల‌కు పైగానే అప్పులు చేశారు.

మ‌రి అలాంట‌ప్పుడు.. మద్యంాన్ని నిషేధించ‌డం సాధ్యం కాద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. కానీ, కోల‌గ‌ట్ల మాత్రం తాము మద్యం నిషేధానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.