Begin typing your search above and press return to search.
మధ్యనిషేధం.. ఏపీకి లాభమా? నష్టమా?
By: Tupaki Desk | 18 Oct 2019 1:34 PM GMTతరతరాల డిమాండ్ అదీ.. ఏపీలో మద్యం నిషేధానికి అడుగులు వేసింది ఎన్టీ రామారావు.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ నాడు రాష్ట్రమంతటా తిరిగితే వినిపించిన ఒకే మాట మద్యనిషేధం.. 1980వ దశకంలో మద్యం వల్ల ఏపీలో ఎన్ని అనర్థాలు జరిగాయి. ఎన్ని కాపురాలు కూలాయి.? ఎంతో మంది మహిళల అర్థనాదాలు విని ఎన్టీఆర్ చలించిపోయారు. అందుకే తెలుగుదేశం మలివిడత గద్దెనెక్కాక 1994లో ముఖ్యమంత్రిగా తొలి సంతకం మద్య నిషేధంపై చేసి అమలు చేశారు. తద్వారా మద్యానికి పెట్టే డబ్బులను చాలా మంది భూములు, ఇళ్లు కొనడానికి బిడ్డల పెళ్లిళ్లు చేయడానికి వాడారు. మద్యం నిషేధం ఏపీలో మంచి ఫలితాలను ఇచ్చింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ వారసుడిగా చంద్రబాబు వచ్చి 1997లో ఎన్టీఆర్ అమలు చేసిన మద్య నిషేధం ఎత్తివేశాడు. 16 నెలలు మాత్రమే మద్య నిషేధం ఏపీలో అమలైంది. మద్యానికి బార్లా తెరిచాడు. దాన్నొక మంచి ఆదాయ వనరుగా మార్చాడు. మద్యమే ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి తీసుకెళ్లాడు. మద్యం అమ్మకాలు లేనిదే ప్రభుత్వాలు నడవని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
అయితే ప్రతిపక్ష నేతగా 3వేల కిలోమీటర్లు నడిచిన జగన్ కు ఇదే మద్యం వల్ల కలుగుతున్న అనర్థాలను ప్రత్యక్షంగా చూశారు. ఏపీలో తాను అధికారంలోకి వస్తే మద్యం నిషేధం చేస్తానని ఎన్నికల అజెండాలో పెట్టారు. ఆ దిశగా మొదట సర్కారీ వైన్స్ ప్రారంభించి మద్యం షాపుల సమయాన్ని కుదించారు. బెల్ట్ షాపులను రద్దు చేశారు. మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించాడు. పర్మిట్ రూంలను తొలగించాడు.
ఏపీ ప్రభుత్వానికి మద్యం ద్వారా 2018-19 సంవత్సరానికి వచ్చిన ఆదాయం అక్షరాల 6222 కోట్లు. రాష్ట్ర ఆదాయం 1,05,062 కోట్లలో ఇది కేవలం 10 శాతానికి ఎక్కువ. మద్యం నిషేధం అమలు చేసినప్పుడు నేరాల సంఖ్య, మహిళలపై గృహహింస తగ్గిందని తేలింది. ఇక ఏపీ ప్రభుత్వానికి నష్టం కేవలం 10 శాతానికే పరిమితమైంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయం నష్టం కంటే లాభాలనే తెచ్చిపెడుతుందని విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు.