Begin typing your search above and press return to search.
నోట్ల పంపిణీ చేస్తూ...అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే
By: Tupaki Desk | 4 Dec 2017 1:26 PM GMTఆసక్తికరమైన రాజకీయాలకు పెట్టింది పేరయిన తమిళనాడులో మరో కలకలం చోటుచేసుకుంది. దివంగత నేత జయంతి శతాబ్ధి వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చే వారికి డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు అధికార పార్టీ ఎమ్మెల్యే. ఆయన కోయంబత్తూరులోని సూలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్.కనకరాజ్. అత్యంత ఆసక్తికరంగా... డబ్బులు పంచిన ఈ సభకు ముఖ్యమంత్రి పళనిస్వామి ముఖ్య అతిథిగా హాజరుకావడం గమనార్హం.
ఎంజీఆర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పబ్లిక్ మీటింగ్ కి పార్టీ కార్యకర్తలను, ప్రజలను సమీకరించేందుకుడబ్బులు, మద్యంతో కూడిన అట్టపెట్టెలను (బాక్సులను) పంపిణీ చేయడానికి సదు ఎమ్మెల్యేగారు సిద్దమవుతుండటం ఈ వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోలో ఎమ్మెల్యే గారి వెనుక అన్నాడీఎంకే కార్యకర్త ఒకరు పెన్నూ, పేపరు పట్టుకొని రాసుకుంటుండగా....మరొకరు రెండు వేల నోట్లను ఎమ్మెల్యేకు ఇస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ..ఎమ్మెల్యే కనకరాజ్ తన చర్యను చక్కగా సమర్థించుకున్నారు.
వీడియో గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి హాజరవుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రజలను తీసుకువచ్చేందుకు పెట్టిన బస్సులు, వాటి సిబ్బంది ఖర్చు, డీజిల్ సహా ఇతరత్రా అవసరాలకు సంబంధించిన చెల్లింపుల కోసం ఈ మొత్తాన్ని తాను ఖర్చు చేస్తున్నానని తన పనిని పక్కాగా సమర్థించుకున్నాడు.
కొసమెరుపుఃఇలా ప్రజలకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఓటర్లు ఎవరూ మద్యానికి, డబ్బులకు లొంగరాదని ప్రసంగాలు ఇచ్చాడు.