Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో 'అన్నదానం' బదులు 'లిక్కర్ దానం'...!
By: Tupaki Desk | 12 April 2020 2:21 PM GMTలాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు కూడా నిలిచిపోయాయి. దీని వల్ల దేశ వ్యాప్తంగా మందుబాబులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల మందు బానిసలు ఆత్మహత్యాయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అయితే మందుకు బానిస అయిన వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. ఆందోళన పడిన కేరళ ప్రభుత్వం మందు లేక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న వారిని వెంటనే డీ ఎడిక్షన్ సెంటర్ లో చికిత్స అందించాలని ఆదేశించింది. అదే విధంగా ఫలానా వ్యక్తికి మందు అవసరం అని డాక్టర్ ఛీటీ రాసిస్తే అతనికి మందు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితి కేవలం ఈ ఒక్క రాష్టానికే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మందుబాబులు నానా అవస్థలు పడుతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా హైదరాబాద్ సహా అన్ని పట్టణాల్లో వలస కూలీల ఆకలి తీర్చేందుకు అన్నదానాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించడంతో విచిత్రంగా హైదరాబాద్ లో ఓ ఆశ్చర్యకర సన్నివేశం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే లాక్ డౌన్ సమయంలో అన్ని దుకాణాలతో పాటు మద్యం షాపులు కూడా మూతపడి మందు బాబులు నానా యాతనకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు యువకుడు లిక్కర్ దానానికి పూనుకున్నారు. రోడ్ల పక్కన నివసించే కూలీలు - ఇతరులకు ఉచితంగా మద్యం పంచుతూ మీడియా ప్రతినిధులకు కనిపించారు. ఈ సన్నివేశం హైదరాబాద్ లోని బ్రాహ్మణ వాడీ ప్రాంతంలో చోటు చేసుకుందట. ద్విచక్ర వాహనాలపై వచ్చిన యువకులు రోడ్డుపై ఉన్న మద్యం ప్రియులకు లిక్కర్ ప్లాస్టిక్ గ్లాసులలో పోసి పంచిపెడుతున్నారు. రోడ్డుపై దుకాణాల ముందు బతుకీడుస్తున్న కొందరికి ఇలా మద్యాన్ని పంచారని తెలుస్తోంది. తమకు రోజూ కల్లు తాగే అలవాటు ఉందని.. ఇప్పుడు అన్ని దుకాణాలు మూతపడడంతో విలవిలలాడుతున్నట్లు వారు చెప్పారు. వీరిలో మహిళలు కూడా ఉండడం విశేషం. ఈ సమయంలో మద్యం పంచుతున్న యువకుడికి వారు నమస్కారం కూడా పెట్టారు. ఈ కరోనా మహమ్మారి వలన ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటనలు ఇంకెన్ని చూడాలో మరి.