Begin typing your search above and press return to search.

మందుబాబుల రికార్డ్.. దీపావళి రోజు కాసుల పంట.. రూ.443 కోట్లు !

By:  Tupaki Desk   |   6 Nov 2021 5:30 AM GMT
మందుబాబుల రికార్డ్.. దీపావళి రోజు కాసుల పంట.. రూ.443 కోట్లు !
X
దీపావళి అంటే దీపాల పండుగ. దీపావళి నాడు పూలు, పండ్లు, స్వీట్లు, టపాసులకే డిమాండ్‌ ఉందనుకుంటే అది మీ పొరపాటే. ఎందుకంటే, తమిళనాడు ప్రభుత్వానికి దీపావళి కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.443 కోట్ల మందును లాగించేశారు మందుబాబులు. పండుగ సందర్భంగా రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.443 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ సారి రూ.24.66 కోట్ల మేర తక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇక, దీపావళి వేళ మద్యం అమ్మకాలను ముందే ఊహించిన సర్కార్‌.. మద్యం స్టాకు కూడా పెంచింది.. కావాల్సిన మద్యాన్ని సమకూర్చింది. ఇక, దీపావళికి ముందు రోజు.. దీపావళి నాడు మద్యం విక్రయాలను ఓసారి పరిశీలిస్తే.. 3వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా రూ.213.61 కోట్ల మేర మద్యాన్ని విక్రయించారు. చెన్నైలో రూ.38 కోట్లు, మదురైలో రూ.47.21 కోట్లు, సేలంలో రూ.44.27 కోట్లు, తిరుచ్చిలో రూ.43.38 కోట్లు, కోయంబత్తూరులో రూ.41.75 కోట్లు మేరకు టాస్మాక్‌ దుకాణాలలో మద్యం విక్రయాలు సాగినట్టు అధికారులు చెబుతున్నారు.. ఇక, 4వ తేదీన మద్యం విక్రయాలు మరింత పెరిగాయి.

4న ఏకంగా రూ.228.42 కోట్ల మేరకు మద్యం అమ్మకాలుసాగాయి.. చెన్నైలో రూ.41.84 కోట్లు, మదురైలో రూ.51.68 కోట్లు, సేలంలో రూ.46.62 కోట్లు, తిరుచ్చిలో రూ.47.57 కోట్లు, కోయంబత్తూరులో రూ.41.71 కోట్ల మేరకు మద్యం విక్రయాలు సాగినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా దీపావళి రోజు పూలు, పండ్లు, స్వీట్లు టపాసులకే కాదు. మద్యానికి కూడా మంచి గిరాకీ తగిలింది.