Begin typing your search above and press return to search.
మెడికల్ షాపు చాటున మద్యం విక్రయాలు
By: Tupaki Desk | 27 July 2020 11:30 PM GMTమద్యంప్రియులు ఆంధ్రప్రదేశ్‌లో తంటాలు పడుతున్నారు. కావాల్సిన బ్రాండ్ దొరక్క.. అధిక ధరలకు కొనలేక ఆంధ్రప్రదేశ్ వాసులు తెలంగాణ నుంచి మద్యం అక్రమంగా సరఫరా చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. లిక్కర్ విధానంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉండడంతో మద్యం వ్యాపారులు సరికొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా మందులు విక్రయించే షాపులో మద్యం విక్రయం సాగిస్తున్న ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇన్నాళ్లు కిరణా దుకాణాలు.. పాన్ షాపులు ఇతర దుకాణాల్లో నడిచిన బెల్టు షాపులు ఇప్పుడు మెడికల్ షాపులకు మారాయి. ఎందుకంటే మెడికల్ దుకాణం అయితే ఎవరికి అనుమానం రాదని భావించారు. కానీ పోలీసులకు సమాచారం అందడంతో ఆ గుట్టు రట్టయ్యింది.
విశాఖపట్టణంలోని లక్ష్మీపురం కాలనీలో మెడికల్ షాపులో మద్యం విక్రయాలు మొదలయ్యాయి. ఆర్కే మెడికల్ షాపులో ఈ దందా కొందరి సహకారంతో ఎంచక్కా సాగుతోంది. అయితే కొందరి సమాచారంతో పోలీసులు దాడులు చేయగా మెడికల్ షాప్ కాస్త మద్యం దుకాణంగా మారిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ దుకాణంలో 7 మద్యం బాటిళ్లు పట్టుబట్టాయి. మద్యం విక్రయించిన నూకరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా మద్యం విక్రయాలు జరుగుతున్న విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.