Begin typing your search above and press return to search.
అమరావతి జిల్లాలో ఎక్సైజ్ ఆదాయం సూపర్!
By: Tupaki Desk | 8 Nov 2016 4:39 AM GMTసమయం ఏదైనా, సందర్భం మరేదైనా... మంచైనా, చెడైనా కచ్చితంగా ఈ మధ్యకాలంలో పార్టీ ఉండాల్సిందే. ప్రస్తుతం చాలామంది దృష్టిలో మందు పార్టీ అనేది కామన్ గానూ, ఫ్యాషన్ గానూ మారిపోయింది. దీంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మందుబాబులు దుమ్ములేపేస్తున్నారు. తాజాగా ఏపీ రాజధాని అమరావతి జిల్లా అయిన గుంటూరులో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మందుబాబుల ఉత్సాహంతో జిల్లాలోని బార్లు, వైన్ షాపులు నిత్య కళ్యాణం, పచ్చ తోరణంలా కళకళలాడుతున్నాయి.
కార్తీక మాసం కారణంగా కొద్దిగా విక్రయాలు ప్రస్తుతం తగ్గినా... ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ శాఖకు ఐఎంఎల్ డిపో విక్రయాల ద్వారానే గడిచిన నాలుగు నెలల్లో సుమారు రూ.500 కోట్ల ఆదాయం లభించింది. వైన్ షాపులు, బార్లకు ఇంతకు డబుల్ ఆదాయం లభించిందంట.
గతేడాదితో పోలిస్తే... ఈ ఏడాది మధ్యం అమ్మకాలు ఫుల్ గా పెరిగాయని చెప్పవచ్చు. గతేడాది జూలైలో రూ.125.01 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది జూలైలో రూ.130.02 కోట్ల అమ్మకాలు జరిగాయి. గత ఆగస్టులో రూ.119 కోట్లు జరుగ్గా, ఈ ఏడాది రూ.120.01 కోట్లు, గతేడాది సెప్టెంబర్ లో 121.12 కోట్ల అమ్మకాలు, ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.123 కోట్లు. అలాగే గత ఏడాది అక్టోబర్ లో రూ.113.05 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది గత నెలలో రూ.115.02 కోట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో ప్రతీనెలా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మద్యం వ్యాపారం మరింతగా జోరుగా సాగుతోందని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/