Begin typing your search above and press return to search.
తిట్టించుకున్నా.. ఏపీ సర్కారు గల్లా గలగలలే!
By: Tupaki Desk | 8 Aug 2017 6:24 AM GMTఈ మధ్యన జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం వెళ్లటం తెలిసిందే. ఉద్దానం ఇష్యూ మీద హార్వర్డ్ నిపుణుల్ని తీసుకొచ్చిన ఆయన.. వారితో కలిపి ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరయ్యారు. నిజానికి ఆ సదస్సుకు అనుకున్న టైంకు పవన్ వెళ్లలేకపోయారు. తన ఆలస్యానికి కారణం చెబుతూ.. తాను వస్తుంటే మహిళలు అడ్డుకున్నారని.. తన చేతికి ప్లకార్డు ఇచ్చారని.. దాన్ని సీఎం చంద్రబాబుకు చూపించాలన్నారని కోరినట్లు వెల్లడించారు.
ఆ ప్లకార్డు ఏమిటో ఆ సందర్భంగా అందరికి చూపించారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు వద్దు బాబు అంటూ ఉన్న నినాదంతో కూడిన ప్లకార్డు అది. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని సభాముఖంగా చెప్పారు పవన్. అయితే.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారా? లేదా? అన్న క్లారిటీ మాత్రం తర్వాత ఇవ్వలేదు.
కట్ చేస్తే.. ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చి నెల గడిచిన తర్వాత అమ్మకాల లెక్కలు చూస్తే.. కళ్లు చెదిరిపోయే పరిస్థితి. కొత్త మద్యం విధానం వచ్చిన నెల వ్యవధిలోనే అమ్మకాలు జోరుగా సాగటమే కాదు.. ఏపీ సర్కారు గల్లాలో కాసులు గలగలలాడాయి. మొదటి నెలకు సంబంధించిన గణాంకాలు బయటకు వచ్చిన నేపథ్యంలో వాటి వివరాలు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. సగటున రోజుకు రూ.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు ఏపీలో సాగుతున్నట్లుగా తేలింది. అంటే.. ఏపీ రాష్ట్ర సర్కారుకు రోజుకు రూ.10కోట్ల మేర ఆదాయం మద్యం కారణంగా వస్తుందన్న విషయం ఈ లెక్కతో తేలినట్లు.
ఇక.. రాష్ట్రంలో మందుబాబులు తాగుతున్న మద్యం లెక్కలు చూస్తే.. బీరు విక్రయాలు భారీగా పెరగ్గా.. మద్యం విక్రయాలు స్వల్పంగా తగ్గినట్లుగా తేలుతుంది. మద్యం వినియోగించటంలో జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నం జిల్లా ఏపీ స్టేట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా.. తూర్పు గోదావరి.. కృష్ణా జిల్లాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది ఇదే నెలలో రూ.239.80 కోట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది అందుకు భిన్నంగా రూ.285.87 కోట్ల అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లో వృద్ధిరేటు 30.91 శాతంగా చెప్పాలి.
నూతన మద్య విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలు రోడ్ల మీదకు వచ్చి.. ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేస్తున్న మద్య దుకాణాలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదన్న విమర్శ ఉంది. గడిచిన నెలలో దాదాపు పదిహేను రోజుల పాటు మద్యం షాపుల ఏర్పాటుపై లొల్లి కారణంగా షాపులు తెరుచుకోలేదు. అయినప్పటికీ అమ్మకాలు అంత భారీగా ఉండటం చూస్తే.. మద్యం పేరుతో ప్రజారోగ్యాన్ని స్ట్రా వేసుకొని మరీ ఏపీ సర్కారు తాగేస్తుందనన్న విమర్శ వినిపిస్తోంది. ఎవరెన్ని అనుకున్నా.. ఏపీ గల్లా పెట్టె మాత్రం మద్యం పుణ్యమా అని కాసులతో గల్లా పెట్టె గలగలాడిపోతుందని చెప్పక తప్పదు.