Begin typing your search above and press return to search.
షాకింగ్: తెలంగాణలో 4 రోజుల మద్యం కలెక్షన్స్
By: Tupaki Desk | 10 May 2020 6:30 AM GMTతెలంగాణలో ఇంత తాగుతారని ఊహించలేదు. 45 రోజులుగా మద్యం లేక ఉగ్గబట్టుకొని ఉన్న మందుబాబులు.. నాలుగు రోజుల క్రితం మద్యం షాపులు ఓపెన్ చేయగానే క్యూకట్టారు. మద్యాన్ని సీసాలకు సీసాలు కొనుక్కొని పోయి తాగేశారు. దాదాపు నెలన్నర తర్వాత చుక్క, ముక్కతో ఎంజాయ్ చేశారు.
అయితే ఈ నాలుగు రోజుల మద్యం కలెక్షన్స్ షాకింగ్ గా ఉన్నాయి. మద్యం అమ్మకాల్లో రికార్డు నమోదైంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచిన నాలుగురోజుల్లో ఏకంగా రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. శనివారం ఒక్కరోజే మద్యం డిపోల నుంచి రూ.149 కోట్ల విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల అమ్మకాలు పరిశీలిస్తే.. మే 6న దుకాణాలు తెరిచిన రోజు రూ.72.5 కోట్లు, మే 7న 188.2 కోట్లు, మే 8న 190.47 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. దీన్ని బట్టి మద్యం షాపులు తెరిచిన నాలుగురోజుల్లోనే తెలంగాణలో మద్యం అమ్మకాలు రూ.600 కోట్లకు చేరుకున్నాయి.
కాగా ఏపీ, ఇతర పక్కరాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం రేట్లను చాలా తక్కువగా పెంచారు. దీంతోనే పక్కరాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మద్యం కొనుగోలు చేశారని.. అందుకే ఈ రికార్డ్ మద్యం అమ్మాకాలు సాగాయని సమాచారం.