Begin typing your search above and press return to search.

మద్యం ప్రియులు.. మే నెలలో ఎంత తాగారో తెలుసా?

By:  Tupaki Desk   |   1 Jun 2021 11:30 AM GMT
మద్యం ప్రియులు.. మే నెలలో ఎంత తాగారో తెలుసా?
X
మండే ఎండల్లో జనాలు చల్లటి బీర్లను పీల్చేస్తున్నారు. మద్యం ప్రియులు ఈ వేసవి కాలంలో బీర్లను తాగి ఊగేసారు. విస్కీ, రమ్ము లాంటివి తగ్గించి చల్లటి బీర్లను తాగేందుకు ఎక్కువగా ఇష్టపడ్డారు. దీంతో బీర్ల విక్రయాల్లో రికార్డులు నమోదయ్యాయి. కరోనా కేసులు ఉన్నప్పటికీ ఈ మే నెల సమ్మర్ హీట్ కు బీర్లు బాగా అమ్ముడుపోయాయి. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి బీర్లు తాగేశారు.

గత ఏడాది జనవరి నుంచి మే నెల వరకు రూ.61 కోట్ల విలువ చేసే బీర్లను తాగగా.. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు రూ.89.83 కోట్ల విలువైన బీర్లు అంతకుమించి తాగేశారు. డిమాండ్ కు తగ్గట్లుగా సరఫరాకు ఇబ్బంది లేకుండా డిపో అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 167 మద్యం దుకాణాలు, 47 బార్లు, 3 క్లబ్ లు ఉన్నాయి. వాటితోపాటు అనధికారికంగా వేల సంఖ్యలో బెల్టు షాపుల్లో బీర్ల అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక బీర్లకు వేసవిలో డిమాండ్ దృష్ట్యా కొన్ని చోట్ల వ్యాపారులు సిండికేట్ గా మారి బీరు ధరలపై అదనంగా వసూలు చేస్తూ జేబులకు చిల్లులు పెట్టి దండుకుంటున్నారు. జిల్లాలో మద్యం దుకాణాల్లో బీర్లు దొరకడం లేదు. పక్కనే ఉన్న బెల్ట్ షాపుల్లో యథేచ్చగా బీర్లు అమ్ముతున్నారు.

ఎండవేడిని తట్టుకోవడానికి మందుబాబులు చల్లని బీర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్చి నుంచి మే నెల వరకు 60శాతానికి పైగా విక్రయాలు పెరిగాయి. మొత్తం 5 నెలల్లోనే మద్యం ప్రియులు అక్షరాలా రూ.89.83 కోట్ల విలువ చేసే బీర్లు తాగేశారు.