Begin typing your search above and press return to search.
ముంబైలో మద్యం బంద్ ... కారణం ఇదే !
By: Tupaki Desk | 6 May 2020 6:30 AM GMTకరోనాను కట్టడి చేయడానికి మరో మార్గం లేక...దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ ను అమలు చేస్తున్నప్పటికీ కూడా కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగిస్తూ జోన్ల వారీగా విభజించి .. లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపు ఇచ్చారు. దీనితో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కాగా , లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా ముంబైలో తెరుచుకున్న లిక్కర్ షాపులు మరోసారి మూతపడ్డాయి .
బుధవారం నుంచి లిక్కర్ షాపులను బంద్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనం లిక్కర్ కోసం భారీగా బయటకు రావడంతో సోషల్ డిస్టెంసింగ్ దెబ్బతింతోందని, వైరస్ అధికంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్పారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ఎషెన్షియల్ సర్వీసెస్ మాత్రమే తెరిచి ఉంచాలని అన్నారు. కరోనాను అరికట్టేందకు లాక్‌డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 వరకు దాన్ని పొడిగించింది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు మాత్రం పర్మిషన్ ఇవ్వడంతో వైన్స్ దగ్గర మందు బాబులు క్యూ కట్టారు.
లాక్ డౌన్ సడలింపులతో మద్యం ప్రియులు లిక్కర్ షాపుల ఎదుట భారీగా చేరుకుంటుండంతో, భౌతిక దూరాన్ని పాటించేలా చేయడం ఇబ్బందికరంగా మారిందని పోలీసులు, అధికారుల నుంచి సమాచారం వచ్చిందని ముంబై మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశీ తెలిపారు. నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులు మాత్రం తెరుచుకునే ఉంటాయని తెలిపారు. కాగా .. ఈ నెల 17 వరకు ముంబైలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. వైద్యం కోసం తప్ప ఇతర పనుల కోసం బయటకు వస్తే ఆరు నెలల పాటు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మహారాష్ట్ర లో కేసుల సంఖ్య 15,525కు చేరగా మరణాల సంఖ్య 617కు చేరింది.