Begin typing your search above and press return to search.
'ముత్తా' లీకులు!..జనసేనలోకి బాబు ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 22 Aug 2018 8:29 AM GMTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన రాజకీయ పార్టీ జనసేనకు ఇప్పుడు మీడియా అండ క్రమక్రమంగా పెరుగుతోందనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఇప్పటికే బాగా యాక్టివ్ గా ఉన్న జనసేనకు ప్రింట్ - ఎలక్ట్రానిక్ మీడియాలోనూ సపోర్ట్ కోసం పవన్ బాగానే వ్యూహం రచించారు. ఓ టీవీ ఛానెల్‌ను ఇప్పటికే కొనుగోలు చేసిన పవన్ బృందం... తాజాగా ప్రింట్ మీడియానూ మచ్చిక చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రభ అధినేత ముత్తా గోపాలకృష్ణను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా... ఓ మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకోవడంతో పాటుగా ఆంధ్రప్రభను తన ప్రచారానికి వాడుకునే వెసులుబాటును చేజిక్కించుకుంది. మొన్నటిదాకా ఇతర పత్రికలతో పాటు ఆంధ్రప్రభ కూడా జనసేన వార్తలను అంతగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే జనసేనలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ముత్తా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారో... అప్పుడే ఆంధ్రప్రభ కూడా తన బాణీని మార్చేసింది. ఎల్లో మీడియా అధికార టీడీపీకి ఏ మాదిరిగా బాకాలు ఊదుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు జనసేనకు కూడా బాకాలు ఊదే పనిని ముత్తా వారి పత్రిక భుజానికెత్తుకుందనే చెప్పాలి.
పవన్ ఇటీవలే మొదలెట్టిన ప్రజా పోరాట యాత్రను కాస్తంత బాగానే కవర్ చేసిన ముత్తా పత్రిక... తూర్పు గోదావరి జిల్లాలో ఎవరెవరు జనసేనలోకి చేరుతున్నారు? వారు ఏఏ పార్టీలకు చెందిన వారు? ఈ చేరికలతో జనసేనకు ఏమేర ప్రయోజనం దక్కనుంది? ఈ చేరికలతో ఆయా పార్టీలకు ఏ మేరకు నష్టం జరగబోతున్నది? అన్న విషయాలను బాగానే ఎలివేట్ చేస్తూ కథనాలను రాసేసిన ఆంధ్రప్రభ... ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనం ప్రకాశం జిల్లాకు చెందినది కావడంతో మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే... ప్రకాశం జిల్లాలో పవన్ సామాజిక వర్గం బాగా తక్కువ. అదే సమయంలో రెడ్లు - కమ్మ సామాజిక వర్గాలు ఈ జిల్లాలో బలంగా ఉన్నాయి. ఆది నుంచి కూడా ఈ జిల్లాలో ఈ రెండు సామాజిక వర్గాలే రాజకీయాలు చేశాయి. చేస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఈ రెండు సామాజిక వర్గాలే ఈ జిల్లా రాజకీయాలను నడిపించనున్నాయని కూడా చెప్పక తప్పదు. ఇలాంటి ప్రకాశం జిల్లాలో జనసేనలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆంధ్రప్రభ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇప్పటికే ఇతర పార్టీల్లో ఉన్న నేతలు చాలా మంది ఇప్పుడు జనసేనలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ఆ పత్రిక రాసిన కథనం ఇప్పుడు నిజంగానే వైరల్‌గా మారిందని చెప్పక తప్పదు. ఎందుకంటే... గడచిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీ అభ్యర్థులకు షాకిస్తూ విజయం సాధించి... ఆ తర్వాత టీడీపీలో చేరిపోయిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్... ఈ జాబితాలో టాప్ ప్లేసులో ఉన్నారు. గడచిన ఎన్నికల సమయాన్ని మినహాయిస్తే... టీడీపీకి ఆమంచి బలమైన నేతగానే వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమంచికే చీరాల టికెట్‌ను ఇచ్చేందుకు టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని, ఆమంచి విజయం సాధించేస్తారని కూడా ఆ పార్టీ వర్గాలు గట్టి థీమాగానే ఉన్నాయి. ఈ క్రమంలో ముత్తా వారి పత్రిక రాసిన కథనం నిజంగానే వైరల్‌గా మారిపోయింది. ఇక ఈ జాబితాలో ఆమంచితో పాటు ఇతరులెవరున్నారన్న విషయానికి వస్తే.. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు (గిద్దలూరు) - మాదిశెట్టి వేణుగోపాల్ (దర్శి) - ఉగ్ర నరసింహారెడ్డి (కనిగిరి) - కాశీనాథ్ (మార్కాపురం)లతో పాటు కనకారావు - షేక్ రియాజ్ లు ఉన్నారు. ఆంధ్రప్రభ కథనం నిజమైతే... జనసేనకు జిల్లాలో ఓ మోస్తరు నాయకత్వం దక్కినట్టేనని చెప్పక తప్పదు. అదే సమయంలో బాబు అల్మారాలోని ఓ విన్నింగ్ ఎమ్మెల్యే టీడీపీ చేజారిపోయినట్టే. చూద్దాం... ఏం జరుగుతుందో?