Begin typing your search above and press return to search.

గ్రీన్‌ - ఆరెంజ్‌ - రెడ్ జోన్ల విభ‌జ‌న ఎలా..?

By:  Tupaki Desk   |   2 May 2020 9:30 AM GMT
గ్రీన్‌ - ఆరెంజ్‌ - రెడ్ జోన్ల విభ‌జ‌న ఎలా..?
X
క‌రోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. అయితే ఆ వైర‌స్ అన్ని ప్రాంతాల్లో అలా లేదు. కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా విజృంభిస్తూ.. మ‌రికొన్ని చోట్ల కొంత ప్ర‌భావం ఉండ‌గా.. ఇంకొన్ని చోట్ల అస‌లు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌లేదు. వీటి ఆధారంగానే రెడ్‌ - ఆరెంజ్‌ - గ్రీన్ జోన్లుగా విభజిస్తున్నారు. అయితే ఆ జోన్లు శాస్త్రీయంగా ఎలా విభ‌జిస్తారో చాలామం‌దికి తెలీదు. ప్ర‌స్తుతం కరోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆ ప‌దాలు తొలిసారిగా వింటున్నారు. అయితే వాటి గురించి పూర్తి అవ‌గాహ‌న లేదు. ఈ విష‌య‌మై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌తనిచ్చింది. క‌రోనా వైర‌స్‌పై పుకార్లు - అవాస్త‌వాలు విస్తృతం గా వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలో కొన్ని అంశాల‌పై ప్ర‌భుత్వం అవ‌గాహ‌న క‌ల్పిస్తోంది. ఈ క్ర‌మంలోనే కంటైన్ మెంట్ జోన్ - బఫర్ జోన్ - రెడ్ జోన్ వ‌ర్గీకర‌ణ‌ పై వివ‌రించింది.

ఆరోగ్య ఆంధ్ర అనే పేరుతో ట్విట‌ర్ ఖాతాలో క‌రోనా పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆ జోన్‌ ల విభ‌జ‌న‌పై ట్విట‌ర్‌ లో వివ‌రించింది. ఈ సంద‌ర్భంగా క‌రోనా వైర‌స్ కేసులను గుర్తించిన నిర్దిష్ట ప్రాంతాలను కంటైన్‌ మెంట్ జోన్‌ గా పిలుస్తారని తెలిపింది.

బ‌ఫ‌ర్ జోన్ (రెడ్ జోన్‌): కంటైన్ మెంట్ జోన్ చుట్టూ ఉన్న ప్రాంతం - కొత్త‌గా ‌కరోనా కేసులు న‌మోద‌య్యే అవకాశం ఉన్న ప్రాంతాలను బఫర్ జోన్‌ గా పిలుస్తారు. ఎక్కువ‌ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉండి.. వ్యాప్తి శాతం ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాలను రెడ్ జోన్‌ లేదా హాట్ స్పాట్ గా పిలుస్తార‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులున్న జిల్లాను రెడ్‌ జోన్‌ గా పిలుస్తారు. నాలుగు రోజుల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రెట్టింపయిన జిల్లాను రెడ్ జోన్‌ గా పరిగణిస్తారు.

ఆరెంజ్ జోన్: క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య‌ తక్కువగా న‌మోదైన‌ ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్‌ గా ప‌రిగ‌ణిస్తారు. రెడ్ జోన్‌ గా ఉన్న ఏరియాలో 14 రోజులపాటు కొత్త కేసులేవీ నమోదు కాకపోతే దాన్ని ఆరెంజ్‌ జోన్‌ గా మారుస్తారు.

గ్రీన్ జోన్‌: పాజిటివ్ కేసులు నమోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా పిలుస్తారు. ఆరెంజ్ జోన్‌ లో 14 రోజుల పాటు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే దాన్ని గ్రీన్‌ జోన్‌ గా మారుస్తారు.

రెడ్‌ జోన్ ఉన్న ప్రాంతం గ్రీన్‌ జోన్‌ గా మారాలంటే 28 రోజులపాటు కొత్తగా క‌రోనా కేసులేవీ నమోదు కాకుండా ఉండాలి. అప్పుడే డదు.