Begin typing your search above and press return to search.
వీరంతా..రేవంత్ వెంట కాంగ్రెస్ లో చేరిపోతారట
By: Tupaki Desk | 21 Oct 2017 10:14 AM GMTతెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైకిల్ దిగి హస్తం పార్టీ లో చేరటానికి సిద్ధమయిపోయారనే ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ విషయాన్నిస్పష్టంగా రేవంత్ ఖండించకపోవడంతో...ఆయన కాంగ్రెస్ లో పోషించే పాత్రపై స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలో..రేవంత్ వెంట ఎవరెవరూ ఉంటారని జోరుగా చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇచ్చిన లిస్టు అంటూ మీడియాలో ప్రచారం సాగుతోంది.
రాహుల్ గాంధీకి ఇచ్చిన జాబితాలో టీడీపీలోని పెద్ద నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ కు అందించిన జాబితాలో తాజా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సహా పార్టీకి చెందిన మాజీ మంత్రులు - టీడీపీ సీనియర్ నేతలున్నారు. మాజీ మంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి - బోడ జనార్దన్ - మాజీ ఎమ్మెల్యేలు సీతక్క - వేం నరేందర్ రెడ్డి - ఎర్ర చంద్రశేఖర్ - సీహెచ్ విజయరమణారావు - మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి - ఒంటేరు ప్రతాప్ రెడ్డి - కంచర్ల భూపాల్ రెడ్డి - రావి శ్రీనివాస్ - వడ్డేపల్లి సుభాష్ రెడ్డి - కవ్వంపల్లి సత్యనారాయణరావు - మేడిపల్లి సత్యం - గడిల శ్రీకాంత్ గౌడ్ - పటేల్ రమేశ్ రెడ్డి - బీల్యా నాయక్ - రాజారాం యాదవ్ - గండ్ర సత్యనారాయణరావు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వీరు కాకుండా భారీ జాబితానే రేవంత్ సిద్ధం చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి వెంట నడిచే వారిలో 8 జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు ఉన్నారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి - సూర్యాపేట జిల్లా ప్రెసిడెంట్ పటేల్ రమేశ్ రెడ్డి - నల్గొండ జిల్లా అధ్యక్షుడు బీల్యా నాయక్ - పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు విజయ రమణారావు - నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ అరికెల నర్సారెడ్డి - భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు - మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ - కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి - మహబూబ్ నగర్ జిల్లా ప్రెసిడెంట్ ఎర్ర చంద్రశేఖర్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే జాబితాలో ఉన్న నేతలందరూ రేవంత్ రెడ్డి వెంట నడుస్తారా? ఈ జాబితాకు రాహుల్ ఓకే చేస్తారా అనేది తేలాల్సి ఉంది.