Begin typing your search above and press return to search.
రేవంత్ 3 లిస్టులతో టీటీడీపీకి చావుదెబ్బే!
By: Tupaki Desk | 30 Oct 2017 9:30 AM GMTరేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అంతంతమాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో భారీగా దెబ్బ తీశారు. సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు మినహా మిగిలిన అందరిని తన పార్టీలోకి చేర్చేసుకున్నారు.
ప్రజల్లో బలమైన పట్టు ఉన్న నేతలకు భారీ పదవులు ఇవ్వటం ద్వారా గులాబీ కారు ఎక్కించేయటం ద్వారా టీడీపీని కోలుకోలేని రీతిలో దెబ్బ తీశారు. రేవంత్ రెడ్డి.. రమణ లాంటి నేతలతో తెలంగాణరాష్ట్రంలో టీడీపీ అపసోపాలు పడుతూ బండిని నెట్టుకొస్తోంది. ఇలాంటి వేళ.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రేవంత్ పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇలాంటి వేళ.. టీడీపీ పునాదులు కదిలిపోయే పరిస్థితులు ఏర్పడనున్నట్లుగా చెబుతున్నారు. కొన ఊపిరితో ఉన్న పార్టీని చావుదెబ్బ కొట్టేలా భారీ సంఖ్యలో నేతలు.. కార్యకర్తలు రేవంత్ వెంట వెళ్లనున్నారన్న ప్రచారం ఇప్పుడు తెలుగు తమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో మూడురంగుల కండువాను మెడలో వేసుకోనున్న రేవంత్ రెడ్డి.. తనతో పాటు భారీ సంఖ్యలో నేతల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చనున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మూడు పేజీలున్న లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లిస్ట్ ఏ..బి పేరుతో ఉన్న జాబితాలో నాయకుల పేర్లు.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాతో పాటు.. ప్రస్తుతం వారు టీడీపీలో ఏ స్థానంలో ఉన్న విషయంతో పాటు.. వారి కులం మతంతో సహా అన్ని వివరాలు ఉండటం ఆసక్తికరంగా మారింది. రేవంత్ రాజీనామా తర్వాత ఆయనకు మద్దతుగా పార్టీకి రాజీనామా చేసింది వేం నరేంద్రర్ రెడ్డి మాత్రమే. ఆయన మాత్రమే రేవంత్‌కు బాహాటంగా మద్దతు పలికారు. మరి.. బయటకు వచ్చిన జాబితా మాటేమిటన్న దానికి వస్తున్న సమాధానం ఏమిటంటే.. మిగిలిన నేతలంతా పార్టీ మారనున్నట్లుగా చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన జాబితా నూటికి నూరు శాతం కరెక్ట్ అని.. టీటీడీపీ నేతలు భారీగా కాంగ్రెస్ లో చేరనున్నారని.. ఈ దెబ్బతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మాటాష్ అయినట్లేనన్న మాట బలంగా వినిపిస్తోంది. ఢిల్లీలో రాహుల్ సమక్షంలో చేరనున్న రేవంత్.. తనతో పాటు హాజరయ్యే నేతల జాబితాను రాహుల్ ఆఫీస్ కు ఇచ్చేందుకే ఈ లిస్ట్ తయారు చేసి ఉంటారని చెబుతున్నారు. అంతేకాదు.. నేతల విడిది కోసం కర్ణాటక భవన్ లో పెద్ద ఎత్తున రూంలు బుక్ చేసినట్లుగా చెబుతున్నారు.