Begin typing your search above and press return to search.
చంద్రబాబు గారి మరో ఘన కార్యం వినండి!
By: Tupaki Desk | 12 Oct 2019 10:07 AM GMTచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు గారు ఇచ్చిన దాదాపు 8,700 చెక్కులు బౌన్స్ కావడం పరాకాష్ట… అని అంటున్నారు పరిశీలకులు. సీఎం రిలీఫ్ ఫండ్ గురించి జారీ అయిన చెక్కుల్లో ఈ మొత్తం మేర బౌన్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇదంతా చంద్రబాబుగారి హయాంలో చోటు చేసుకున్న ఘన కార్యంగా తెలుస్తూ ఉంది. అసలుకు చంద్రబాబు హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో పెద్ద స్కామే నడించిందని సమాచారం.
స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి ఆఫీస్ వేదికగా ఈ స్కామ్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్కామ్ లో చంద్రబాబుతో సహా అందరికీ వాటా ఉన్నట్టే అని అంటున్నారు. తెలుగుదేశం నేతలు, ప్రైవేట్ ఆసుపత్రులు ఒక మాఫియాగా ఏర్పడి సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ ను నడిపించాయని సమాచారం. ఇలా ఆపదల్లో ఉన్న వారికి అందాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులను పచ్చ పురుగులు మేసేశాయని సమాచారం.
సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దాదాపు 22 వేలకు పైగా వినతులు వచ్చాయట. అయితే వాటిని పక్కన పడేసి, తెలుగుదేశం పార్టీ ముఠా కొన్ని ఫేక్ అప్లికేషన్లతో దందాను సాగించినట్టుగా తెలుస్తోంది. ఎల్వోసీ లు, రియంబర్స్మెంట్ మంజూరు చేయడంలోరాజకీయ, కుల వివక్ష చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 80 శాతం పైగా సహాయ నిధిని కేవలం కొద్దిమంది పచ్చ ఎమ్మెల్యేలు కొన్ని అనుకూల ఆస్పత్రులు దోచుకున్నాయి. ఈ అవినీతిని దందా ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా సాగడం ఆశ్చర్యకరంగా భావించవచ్చు.
వేలాది మందికి చెల్లని చెక్కులు ఇచ్చారు వైద్యం చేసిన ఆసుపత్రులకు 2017 నుంచి వందల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టారు. అస్మదీయ ఆసుపత్రులకు మాత్రం అడ్డగోలుగా చెల్లించినట్టుగా తెలుస్తోంది.
చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న ఈ రిలీఫ్ ఫండ్ స్కామ్ విషయంలో విచారణకు ఏపీ ప్రభుత్వం సమాయత్తం అయ్యింది. ఇప్పటికే జరిగిన స్కామ్ ను గుర్తించి ఆ ముఠాపై కేసులు పెడుతూ ఉన్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు సక్రమంగా చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం చూస్తోంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ విషయంలో జాగ్రత్తలు మొదలయ్యాయి. వైద్యుడు అయిన హరికృష్ణను ఈ బాధ్యతల్లో నియమించి, బాధితులకు సహాయం అందేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 2421 ఎల్వోసీలను, 2749మెడికల్ రియింబర్సుమెంట్లు, 21 పైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలుపుకొని మొత్తం 5191 దరఖాస్తులను పరిశీలించి దాదాపు 52 కోట్లు మంజూరు చేయడం విశేషం. ఈ ప్రక్షాళన చర్యల్లో రియింబర్సుమెంట్లు కాస్త ఆలస్యమైనా, ఎల్వోసీ లను సత్వరంమంజూరు చేస్తున్నారు. ఈ చర్యలన్నీ నిజమైన పేదవారికి న్యాయం జరిగే దిశగా సాగుతుండటం సంతోషకరం.