Begin typing your search above and press return to search.
సీసీ ఫుటేజ్: పట్టపగలు నడిరోడ్డు మీద హత్య!
By: Tupaki Desk | 4 Nov 2016 10:05 AM GMTమానవత్వం మచ్చుకైనా కనిపించని సంఘటనా లేక మానవత్వపు ఛాయలు కనిపించని చోట జరిగిన ఘటనా అనే అనుమానం కలిగేలా జరిగింది ఒక సంఘటన! వెంటనే విషయానికొచ్చేస్తే... 49 ఏళ్ల వెజానంద్ ఓజాహియా - అతడి కొడుకు కలిసి అబాబాయ్ అమలియా (27) ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా పొడిచి చంపేశారు. పట్టపగలు - నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. ముందుగా గొడవకు దిగిన వెజానంద్ - అమలియాపై విరుచుకుపడ్డాడు. అనంతరం అతడిపై పిడిగుద్దులు గుద్దుతూ, రాళ్లతో దాడి చేశాడు. అక్కడికీ ఆవేశం చల్లారలేదో ఏమో కానీ... కత్తులతో వీరంగం చేశాడు. దీంతో దాడికి గురైన అమలియా అక్కడికక్కడే కుప్పకూలిపడిపోయాడు.
ఈ దాడి జరగడం ఒకెత్తు అయితే... ఈ దాడి అనంతరం సుమారు 2 గంటలపాటు బాధితుడు రక్తంమడుగులో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదలడం మరొకెత్తు. ఆ సమయంలో ప్రాణాప్రాయం స్థితిలోవున్న ఆ వ్యక్తిని - ఆ తతంగాన్నంతా టీవీ చూసినట్టు చూశారు తప్ప కాపాడేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. గుజరాత్ లో పట్టపగలే ఈ దారుణం జరిగింది. గోకుల్ నగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలన్నీ సీసీకెమెరాలో రికార్డయ్యాయి. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం వల్లే అమలియాను అత్యంత దారుణంగా చంపేశారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/